News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అనుకున్నంత కొత్తదనమేం లేదు

సినిమా- డియర్ కామ్రెడ్
తారాగణం- విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా, సుహాస్‌, చారుహాస‌న్‌ త‌దిత‌రులు
మ్యూజిక్- జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌
కెమెరా: సుజిత్ సారంగ్
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం- భ‌ర‌త్ క‌మ్మ‌

పరిచయం………….
గీత‌గోవిందం, అర్జున్ రెడ్డి  సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజ‌య్ దేవరకొండ‌. పెళ్లి చూపుల నుంచి డిఫరెంట్ కధలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత‌గోవిందం హిట్ ఫెయిర్ గా పేరు సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మరోసారి జంట‌గా న‌టించారు. నూతన దర్శకుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమా రూపొందింది. కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌, స్టేట్ లేడీ క్రికెట‌ర్ మ‌ధ్య సాగే ప్ర‌యాణ‌మే డియర్ కామ్రేడ్. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ లో హీరో, హీరోయిన్ ప్రేమ, భావోద్వేగాలను బాగా చూపించారు. ఇంతకీ డియ‌ర్ కామ్రేడ్‌కు అర్థ‌మేంటి.. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏంచెప్పదలుచుకున్నారో తెలుసుకుందామా..
dear comred
డిర్ కామ్రేడ్ కధ….
విశాఖపట్నంలో ఉండే చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కళాశాల విధ్యార్ధి నాయకుడు. త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే ఏ మాత్రం చూస్తూ ఊరుకోడు. గొడ‌వ‌ల్లో ముందుండే అతని దందుడుకు ప్రవర్తనని అత‌ని స్నేహితులు, త‌ల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలో బాబీ వాళ్ల ఎదురింటికి వాళ్ల బంధువు అప‌ర్ణా దేవి అలియాస్ లిల్లీ(ర‌ష్మిక మంద‌న్న) వ‌స్తుంది. తొలి చూపులోనే బాబీ, లిల్లీని ఇష్టపడతాడు. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌. ఇంకేముంది లిల్లీ కూడా బాబీ ప్రేమ‌ను అంగీకరిస్తుంది. అయితే లిల్లీకి గొడ‌వ‌లంటే అస్సలు పడదు. గొడవలంటే ఆమెకు చచ్చేంత భయం. గొడవలకు దూరంగా ఉండ‌ాలని లిల్లీ ఎన్ని సార్లు చెప్పినా బాబీ మాత్రం వినిపించుకోడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో బాబీకి దూరంగా వెళ్లిపోతుంది లిల్లీ. ఈ క్రమంలో బాబీ పిచ్చోడైపోతాడు. ఏంచేయాలో పాలుపోక చివ‌ర‌కు దేశం మొత్తం టూర్ తిరుగుతాడు. మూడేళ్ల తరువాత మళ్లీ ఇంటికి తిరిగి వస్తాడు బాబీ. మరి బాబీ తిరిగి వచ్చాక ఏం జరిగింది.. మళ్లీ లిల్లీ బాబీని కలిసిందా.. ఇద్దరూ ఒక్కటయ్యారా.. ఇవన్నీ తెలియాలంటే డియర్ కామ్రేడ్ సినిమా ధియేటర్ లో చూడాల్సిందే..
dear comred
ఎలా ఉందంటే…..
విజ‌య్ దేవ‌ర‌కొండ కాలేజ్ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ పాత్ర‌లో బాగా ఒదిగిపోయాడు. ఓ వైపు కోపంగా ఉంటూనే..  మ‌రో వైపు ల‌వ‌ర్ బోయ్‌లా ఉండి ఫ‌స్టాఫ్ అంతా పరవాలేదనిపించాడు. ఇక సెకండాఫ్ లో కూడా రెండు షేడ్స్‌లోనే నటించాడు విజయ్ దేవరకొండ. ఇక లిల్లీ అనే లేడీ క్రికెట‌ర్ పాత్ర‌లో ర‌ష్మిక చక్కగా నటించింది. ఈ పాత్ర కోసం ఆమె ప‌డ్డ తపన ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది. సీనియర్ నటుడు చారుహాస‌న్‌, క్రికెట్ చీఫ్ సెల‌క్ట‌ర్ పాత్ర‌ పోషించగా.. సుహాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. జిస్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతం పెద్దగా ఆక‌ట్టుకోలేదని చెప్పవచ్చు.
dear comred
అంతా ఇలా చేశారు…..
సినిమాలో ప్రధానంగా  మ‌హిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సినిమాలో అసలు పాయింట్‌ను బాగానే ఎన్నుకున్నా.. క‌థ‌ను చెప్పిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. విజ‌య్ దేర‌వ‌కొండ‌, ర‌ష్మిక మందన సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఐతే ఆ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లు సినిమా లేదని చెప్పవచ్చు. సెకండాప్ స్టార్టింగ్‌లో హీరో టూర్‌లో తిరుగుతూనే ఉండటంతో ఏ మాత్రం కొత్తద‌నం లేదనిపించకమానదు. చెప్పాల్సిన కధ బాగానే ఉన్నా.. దాన్ని కధనంగా మార్చే ప్రయత్నంలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడక్కడా కాస్త ప్రేమ.. కొంత భావోద్వేగాలు తప్ప.. పెద్దగా సినిమాలో ఏం లేదని చెప్పవచ్చు. మరీ అంచనాలతో కాకుండా.. ఏదో టైంపాస్ కోసం ఐతే సినిమా చూడొచ్చు..

- Advertisement -

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Tags: dear comred review,  dear comred movie rating, dear comred exclusive review

Leave A Reply

Your email address will not be published.