
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పొటికల్ సర్కిర్ల్లో వైరల్ గా మారిన కొద్ది గంట్లోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు వైధ్యులు. ఇంతకు ఏం జరిగిందని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. గవర్నర్ నర్సింహన్ ఆయన సతీమణి విమలతో కలిసి.. ఆదివారం బీహార్ లోని బుద్ద గయకు పర్యటనకు వెళ్ళారు. అయితే సోమవారం ఉదయం.. నరసింహన్ విపరీతంగా వాంతులు చేసుకున్నారట. దీంతో అప్రమత్తమైన అక్కడి అదికారులు నర్సింహన్ ను .. సమీపంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. రక్త పరీక్ష, ఈసీజీ, ఇతర పరీక్షలు చేసిన డాక్టర్లు.. రిపోర్టులో ఎలాంటి సమస్య రాలేదని.. ఏమీ కాలేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆంధోళన చెందవద్దని ప్రకటించారు. చికిత్స అనంతరం అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్న నరసింహన్ .. సాయంత్రం తన సతీమని విమలతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో అక్కడి అదికారులతో పాటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నర్సింహ్మన్ కు గతంలో ఏ గవర్నర్ కు లేని విధంగా ఏపీ ,తెలంగాణతో అనుబంధం ఉంది. ఆయన.. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు కలుపుకుని పదేళ్లుగా గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు.