News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆర్టీసీ సమ్మెతో నెక్స్ట్ ఏం జరగబోతోంది

కేసీఆర్ హెచ్చరికలను భేఖాతారు చేసిన కార్మికులు

- Advertisement -

హైదరాబాద్:
టీఎస్సార్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికను కార్మికులు బేఖాతరు చేషారు. ఇప్పటికి తమ డిమాండ్లను నెరవేరిస్తే తప్పా సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చిచెప్పారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను టీఎస్సార్టీసీ జేఏసీ ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో తమ నిరసన కార్యక్రమాలు వివరించారు.

రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ లేఖలు ఇస్తామని చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటలకు అన్ని డిపోల దగ్గర కార్మికుల కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడతారని, ఎల్లుండి ఉదయం 8 గంటలకు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తామని, అనంతరం, ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.ప్రయాణికులకు అసౌకర్యం కల్పించడం జేఏసీ ఉద్దేశం కాదని, సెప్టెంబర్ లోనే సమ్మె నోటీస్ ఇచ్చామని గుర్తుచేశారు.

ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తిగా మారింది. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించేందుకు కూడా సీఎం కేసీఆర్ వెనకాడరని.. ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని అధికారపార్టీ నేతలు.. చెబుతున్నారు. ఆదివారం రోజు ఆర్టీసీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ ని రెండు లేదా మూడు ముక్కలు చేస్తారని ప్రచారం అవుతోంది. లేదా ఆర్టీసీ ని ప్రయివేటు పరం చేస్తారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు తలొగ్గొద్దని సీఎం కెసిఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక కార్మికులు కూడా అంతే పట్టుదలతో ఉండటం తో ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.