News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈఆర్సీ నియమించాలని డిమాండ్ ..!

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లేక‌పోవ‌డంపై మ‌ల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈఆర్సీ అనుమతి లేకుండా విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా చట్ట విరుద్దమేనని రేవంత్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా త‌క్ష‌ణం .. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మెన్ .. సభ్యులను నియమించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయ‌న‌ బహిరంగ లేఖ రాశారు. కీలక స్వతంత్ర సంస్థలు… ఐదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమయ్యాయని రేవంత్ విమర్శించారు. ఈఆర్సీ పాలకమండలి పదవీ కాలం పూర్తై ఎనిమిది నెలలు కావస్తున్నా… భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ఆయ‌న నిల‌దీశారు.

Revanth Reddy

ఆర్థిక క్రమశిక్షణ లోపించి .. విత్యుత్ సంస్థలు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఈఆర్సీకి ప్రభుత్వం నివేదికలు అందించలేదని ఆయ‌న చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలు నవంబరు 2 లోపు పంపాల్సి ఉన్నందున .. ఛైర్మెన్ మ‌రియు సభ్యుల నియామకం వెంట‌నే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి త‌న లేఖ‌లో కోరారు.

- Advertisement -

Revanth reddy

Tags: REVANTH REDDY, UTTAM KUMAR REDDY, BHATTI VIKRAMARKA, CONGRESS,CLP, ASSEMBLY, CONGRESS MPS,CM KCR, TELANGANA GOVERNMENT,MP REVANTH REDDY WROTE A LETTER TO CM KCR,ERC, POWER DEPORTMENT, SECRETARIAT

Leave A Reply

Your email address will not be published.