News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఉరి వేసుకుని చ‌నిపోయిన బిజేపీ ఎమ్మెల్యే…


ఎమ్మెల్యే ఆత్మ‌‌హ‌త్య చేసుకున్నారు. అది కూడా.. ఉరివేసుకుని.. ఇదే ఇప్పుడు బెంగాల్ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తుంది. అవును.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ రే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించ‌డం సంచ‌లనం సృస్టిస్తుంది. హెమ్తాబాద్‌ నియెజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి గెలిచిన దేవేంద్రనాథ్‌ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు. నార్త్ దినాజ్‌పూర్‌ జిల్లాలోని బిందాల్ గ్రామంలో నివాసం ఉండే దేవేంధ్ర‌నాథ్ .. త‌న ఇంటికి స‌మీపంలోని మార్కెట్‌ దగ్గర ఉరివేసుకుని.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తె‌ల్ల‌వారు జామున విగ‌త జీవిగా ఉన్న‌దేవేంద్ర నాథ్ ను చూసిన జ‌నం పోలిసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

అయితే.. సోమ‌వారం తెల్లవారుజామున 1 గంట సమయంలో కొంతమంది ఎమ్మెల్యేను పిలవ‌డంతో.. ఎమ్మెల్యే వారితో క‌లిసి బ‌య‌టికి వ‌చ్చార‌ని.. తెల్ల‌వారు జామున ఆయ‌న షాము ఉందు ఉన్న పైక‌ప్పుకు వేలాడుతు క‌నించార‌ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దేవేంద్రనాథ్‌ను బాయ‌టికి పిలిచిన వారే హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని బంధువులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మృతి కేసును సిబిఐకు అప్పగించాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా న‌లుగురికి ధైర్ఘ్యం చెప్పాల్సిన ఎమ్మెల్యే ఇలా ఉరి వేసుకుని ఆనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డం.. ఇప్పుడు బెంగాల్ లో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.