News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎన్టీఆర్ సినిమా రివ్యూ

సినిమా- ఎన్టీఆర్‌-కథానాయకుడు

తారాగణం- నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా, సుమంత్‌, భరత్‌ రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌ తదితరులు

మ్యూజిక్- ఎం.ఎం.కీరవాణి

మాటలు- బుర్రా సాయిమాధవ్‌

నిర్మాతలు- నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం- క్రిష్ జాగర్లమూడి

న్యూస్ పిల్లర్ రేటింగ్.. 4/5

పరిచయం…….

ఎన్టీఆర్.. ఈ ముడు అక్షరాలు తెలుగు వారందరికి దాదాపు ఆర్ధ్యమేనని చెప్పవచ్చు. కేవలం నటుడిగానే కాకుండా నాయకుడిగా కూడా ఎన్టీఆర్ తెలుగు ప్రజల మనసులకో ఎంతో చేరువయ్యారు. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప వాడు ఎన్టీఆర్. వెండితెర‌పై పౌరాణిక‌, సాంఘిక, జాన‌ప‌ద‌ ఇలా అన్నింటిని త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేసిన గొప్ప న‌టుడు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు పోషించిన‌న్ని పౌరాణిక పాత్ర‌లు మ‌రో న‌టుడు పోషించలేదంటే అతిశ‌యోక్తి కాదేమో. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్ పేజీలు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ‌న‌వి చెప్పకతప్పదు. తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ ఎలాంటి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారో.. ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్య మంత్రి స్థాయికి ఎదిగి అదే స్థాయిలో ఆకాశానికెదిగారు. అంతటి ఘణ కీర్తిని కలిగిన ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను వెండితెరపై ఆవిష్క‌రించే ప్రయత్నం ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేస్తే అది అభిమానులకి పండగే కదా. బాలకృష్ణ టైటిల్ రోల్‌లో న‌టించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం క‌థానాయ‌కుడు ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు రానే వచ్చింది. ఇంతకీ ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా ఎలా ఉంది.. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారా.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాలి.. మరి చూసేద్దామా…

- Advertisement -

ntr

ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా కధ….

నందమూరి తారకరామారావు జీవితం తెరిచిన పుస్త‌కమే. ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రజలకు, అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదనే చెప్పాలి. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం గురించి అంద‌రికీ తెలులు. ఎన్టీఆర్ తన కుటుంబానికి ఎంతో విలువ ఇస్తారన్నది జగమెరిగిన సత్యమే. ప్రధానంగా తన ధర్మపత్ని బ‌స‌వ‌తార‌క‌ంకు అందరికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది మాత్రం చాలా మందికి తెలియని విషయం. ఇదిగో ఇలా చాలా మందికి తెలియని అంశాలెన్నింటినో ఎన్టీఆర్ కధానాయకుడులో కళ్లకు కట్టినట్లు చూపించారు. అసలు ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా కధ ఆయన సతీమణి బసవతారకం కోణంలోంటే ప్రారంభమవుతుంది. చాలా వరకు సినిమా కూడా ఆమె కోణంలోనే సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం (విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌ డబ్బుతో భాదపడుతుంది. తన తల్లి ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌ (క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా కధ ప్రారంభమవుతుంది. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తున్న సమయంలో ఎన్టీఆర్ అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

- Advertisement -

ఎన్టీఆర్(బాల‌కృష్ణ‌) వాస్తవ పరిస్థితులేంటీ, ఆయనకు  సినిమాల‌పై ఇష్టం ఎందుకు పెరిగింది, సినిమా రంగంలోకి వచ్చాక ఎన్టీఆర్ ఎలా రాణించాడు, ఒక మామూలు రైతు బిడ్డ గొప్ప నటుడిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా ఎదిగాడన్నదే ఎన్టీఆర్ కధానాయుకుడు అసలు కధ. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా ఒదిగిపోయారు.. ఎన్టీఆర్ సతీమణి బ‌స‌వ‌తార‌కంగా బాలీవుడ్ నటి విద్యాబాల‌న్ ఎలా నటించారు…  సినిమాలో మిగతా నటుల పాత్రలేంటీ.. ఎన్టీఆర్ జీవియంలో అందరికి తెలియని అంశాలేంటీ.. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా చూడాల్సిందే….

ntr

ఎన్టీఆర్ ఎలా ఉందంటే…..

ముందుగా అసలు ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఓ గొప్ప సంకల్పం అని చెప్పవచ్చు. ఆ సంకల్పానికి పూనుకోవడమే కాదు.. దాన్ని కార్యరూపంలో పెట్టడం మరో ఎత్తు. ఎన్టీఆర్ బయోపిక్ కధకు త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. నందమూరి తారకరామారావు జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాల‌నుకుంటారో.. అవ‌న్నీ తెర‌పై చూపించారు. ఎన్టీఆర్ సినీరంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కోసారి మ‌న‌కు చూపించి మళ్లీ ఆ రోజులను గుర్తు చేశారు. ఈ సన్నీవేశాలన్నీ చూస్తోంట ఓ పండ‌గ‌లా ఉంటుంది. ఎలనాడు ఎన్టీఆర్ పోషించివన పాత్ర‌ల్లో బాల‌కృష్ణ బాగా ఒదిగిపోయారు. ఇక ఎన్టీఆర్ పాత్రల్లో నటించిన బాలకృష్ణ అభిమానుల‌ను అల‌రిస్తారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో భావోద్వేగమైన స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకం మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా చూపించారు. ఒక భ‌ర్త‌.. భార్యకు ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా అన్నది ఈ సినిమా చూసాకే తెలుస్తుందని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు డైరెక్టర్ క్రిష్. అసలు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది.. మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్‌కు ఎలా అవకాశం వచ్చింది.. తోటరాముడి పాత్ర ఎలా దక్కింది.. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు అధ్బుతంగా చూపించాడు. ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు చూస్తోంటే రోమాలు నిక్క‌బొడుచుకుంటాయి. ఓ సందర్బంలో కుటుంబమా.. సినిమానా.. ఏది ముఖ్యం అంటే నాకు సినిమానే ముఖ్య‌మ‌ని మొదట్లో ఎన్టీఆర్ ఎందుకు చెప్పార‌నే దానికి స‌మాధానం ఇంటర్వెల్ కు ముందు తెలుస్తుంది. తన కుమారుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఎన్టీఆర్ గొప్ప తనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అసలు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి.. క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌నుకున్నాడ‌ది క్లైమాక్స్ లో చూస్తాం.

ntr

అంతా ఇలా చేశారు..

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి చారక రామారావు జీవిత చ‌రిత్ర‌ను తెర‌పై చూపించ‌డం అంత ఆశామాషి వ్యవహారం కాదు. ఎన్టీఆర్ జీవితంలోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దానికి త‌గిన న‌టీన‌టుల‌ను ఎంచుకోవాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌, అత‌ని బృందం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాలోని ప్ర‌తి పాత్ర జీవం పోసుకున్నట్లే కన్పిస్తుంది. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌.. చాలా వైవిధ్యమై గెట‌ప్పుల్లో క‌నిపించారు. ప్ర‌తి గెటప్ కు ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ప్రధానంగా వెంక‌టేశ్వ‌ర‌స్వామి, కృష్ణుడు పాత్ర‌ల్లో బాల‌కృష్ణ చూడ‌టం అభిమానుల‌కు నిజంగా పండ‌గ‌ే అని చెప్పవచ్చు. ఐతే ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌నిపించిన స‌న్నివేశాలు కొంత బాగా లేవని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సతీమణి బ‌స‌వ‌తార‌కంగా బాలీవుడ్ నటి విద్యాబాల‌న్ జీవించారంటే అతియోశక్తి కాదేమో. విద్యాబాలన్ ను ఎంచుకోవ‌డ‌మే ఎన్టీఆర్ సినిమాకు ప్ర‌ధాన బ‌లమని చెప్పవచ్చు. బసవతారకం పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్ చాలా చ‌క్క‌గా ఒదిగిపోయారు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఎక్కినేనే అనిపించేలా సుమంత్ కనిపించారు. చాలా మందికి తెలియని ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల అనుబంధాన్ని సినిమాలా బాగా చుపించారు. చంద్ర‌బాబు నాయుడుగా దగ్గుబాటి రానా పాత్ర సినిమా చివ‌రిలో వస్తుంది.

చివరగా…………..

ఎన్టీఆర్- కధానాయకుడు సినిమా అద్భుతం అని చెప్పవచ్చు. ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి ప్ర‌తిభ‌ను మెచ్చుకోకుండా ఉండలేం. అభిమానుల‌కు ఏం కావాలో అవ‌న్నీ ఈ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ చ‌రిత్ర ఒక పాఠంలా మిగిలిపోయేలా ఈ సినిమాను రూపొందించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ అని చెప్పవచ్చు. సినిమాలోని ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. ఇక మాటల రచయిత బుర్రా సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు ఎన్టీఆర్ సినిమాకు ఆయువుప‌ట్టు. ప్ర‌తి స‌న్నివేశంలో ఒక భావోద్వేగపు సంభాష‌ణ ఉంటుంది. మొత్తానికి ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా మహాద్భుతం అని చెప్పవచ్చు. ప్రతి తెలుగువాడు ఈ సినిమా ఒక్కసారైనా చూడాలి. అంతటి అధ్బుతమైన సినిమా ఎన్టీఆర్.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.