News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎఫ్-2 సినిమా రివ్యూ..

సినిమా- ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

తారాగణం- విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, మెహరీన్‌, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, నాజర్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ తదితరులు

మ్యూజిక్- దేవిశ్రీ ప్రసాద్‌

నిర్మాత- దిల్‌రాజు

దర్శకత్వం- అనిల్‌ రావిపూడి

పరిచయం……………….

విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు కామెడీ సమ్మిళతమైన సినిమాలు చేయడం వెంకటేష్ కు వెన్నతో పెట్టిన విద్య. అటు వరుణ్ తేజ్ సైతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకున్నారు. వీరిద్దరికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడి తోడయ్యాడు. పటాస్, సుప్రీమ్, రాజా దీ గ్రేట్ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇదిగో ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ఎప్-2. మరి సినిమా ఎలా ఉందో చూసేద్దామా….

f2

- Advertisement -

ఎప్-2 కధ……

- Advertisement -

ఇక కధలోకి వెళ్తే.. హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. ఇక వెంకీ (వెంక‌టేష్‌) ఓ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. కధలో భాగంగా హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అంతవరకూ బాగానే సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లి తరువాత ఒక్క‌సారిగా తలక్రిందులవుతుంది. పెళ్లాం హారిక, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే వ‌రుణ్ యాద‌వ్‌ (వ‌రుణ్‌తేజ్‌) వెంకి మరదలు హ‌నీని ప్రేమిస్తాడు. ఐతే అత్తింటి ప‌రిస్థితులు తెలిసిన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌ కు చెబుతాడు. ఐతే మైకంలో ఉన్నవ‌రుణ్‌ ఇవేమీ పట్టించుకోడు. వెంకీ ఎంత చెప్పినా చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. ఇంకేముంది అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి వంకీ, వరుణ్ లు ఇద్దరూ సతమతమవుతుంటారు. ఇదంతా గమనించిన పక్కింటి వ్యక్తి (రాజేంద్రప్రసాద్) అక్కా చెల్లెళ్ల తిక్క కుదరాలంటే కొన్నాళ్లు ఇద్దరు ఎటైనా వెళ్లిపోండని సలహా ఇస్తాడు. రాజేంద్రప్రసాద్ సలహా మేరకు ఇద్ద‌రూ యూర‌ప్ కు వెళ్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా అనుకోకుండా వెంకీ.. వ‌రుణ్‌ల‌తో పాటు వారి భార్యలు హారిక‌.. హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. యూరప్ లో ప్ర‌కాష్‌రాజ్ ఇంట్లో ఉంటారు. మరి వీరి యూరప్ ట్రిప్ ఎలా సాగింది.. యూరప్ ట్రిప్ లోనైనా తమ భార్యలను కంట్రోల్ లోకి తెచ్చుకున్నారా.. అన్నది చూడాలంటే మాత్రం సినిమాకు వెళ్లాల్సిందే…

ఎలా ఉందంటే………

ఎప్-2 పక్కా భార్యా బాధితుల సినిమా అన్నమాట. తమ తమ భార్యల వేధింపులు పడలేక ఇద్దరు భర్తలు పడే బాదలే ఎప్-2. ఐతే భార్య వేధింపులతో ఇబ్బంది పడే వెంకీ, వరుణ్ లు భలే కామెడీ తెప్పిస్తారన్నమాట. ఐతే ఇవన్నీ ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే మనకు కన్పిస్తాయి. నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రీ లాంటి సినిమాల్లో వెంక‌టేష్ చేసిన పాత్ర‌లు మ‌ళ్లీ ఈ సినిమాలో గుర్తుకు వస్తాయి. సినిమా మొదటి భాగమంతా సరదాగా గడిచిపోతుంది. మొత్తం సీన్లన్నీ నవ్వులు పూయిస్తాయి. అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా యూర‌ప్ లోనే గడుస్తుంది. ఐతే సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త గాడి తప్పుతుందని ఇట్టే తెలిసిపోతుంది. వెంకీ-తమన్నా, వరుణ్- మెహరిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు తప్ప మిగతా అంశాలు పెద్దగా ఆకట్టుకోవలని చెప్పవచ్చు. కధలో పెద్దగా విషయం లేకపోయినా.. కధనాన్ని వెరైటీ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను అతికించినట్లు ఉండటంతో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

f2

అంతా ఇలా చేశారు…….

హీరో వెంక‌టేష్ చాలా కాలం ఫ్యామిలీ ఓరియంటెడ్ విత్ కామెడీ సినిమా చేశారు. గత సినిమాల్లో వెంక‌టేష్ కామెడీ ఎలా ఉంటుంటో.. ఈ సినిమాలోను అలాగే ఉంది. ఎఫ్-2 సినిమాలో వెంకటేష్ పాత్రే బావుందని చెప్పవచ్చు. వ‌రుణ్ తేజ్ పాత్ర కూడా సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. వరుణ్ తేజా తెలంగాణ యాస‌లో మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. అందాల భామ త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించింది. మరో ముద్దుగుమ్మ మెహ‌రీన్ కూడా బాగానే అందాలను ఆరబోసింది. ఇక రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు, ర‌ఘుబాబు ఇలా ప్ర‌తి పాత్ర కామెడీని పండించింది. కాసేపు సరదాగా నవ్వి.. ఎంజాయే చేయాలనుకునే వారు మాత్రమే ఎఫ్-2 సినిమా చూడాలి.–

Leave A Reply

Your email address will not be published.