News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎవ‌రు చేయ‌ని ప‌ని.. ఆ స్పీక‌ర్ చేశాడు..!

ఓ చిన్న పదవి వ‌చ్చిందంటే.. ఇక అత‌ను చూపే డాంబింకం అంతా ఇంతా ఉండ‌దు.  తానేదో ఇత‌రుల కంటే ఎక్కువ‌ని.. త‌న స్థాయికి ఇత‌రు లెవ‌రు స‌రి పోరని ఫీల్ అవుతుంటారు. అంత‌కు ముందు క‌లివిడిగా ఉన్నప్ప‌టికి.. ప‌ద‌వి ద‌ర్పంతో.. త‌న‌కు తాను ఫ‌రిధిని క్రియేట్ చేసుకుని ఇక అందులోనే ఉండిపోతారు. కాని ఇత‌ను అలాంటి వాడు కాదు. త‌ను ఎంత గొప్ప ప‌ద‌విలో ఉన్నా.. ఎదుటివారికి   ఎంత గౌర‌వం .. ఇవ్వాలో ఇచ్చి తాను అంద‌రిలోకి స్పెష‌ల్ అని నిరూపించుకున్నారు. అయ‌నే.. న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ట్రెవర్‌ మలార్డ్. ఇంత‌కు ఆయ‌న చేసిందేమిట‌ను కుంటున్నారా..? అయితే వివరాల్లోకి  వెళితే..

speaker_triver_malard_and_mp_tamati_coffey_in_newzealand_parleament

- Advertisement -

న్యూజిలాండ్‌ పార్లమెంట్ పార్ల‌మెంట్ స‌మావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అంద‌రిలాగే.. ఎంపీ ట‌మాటి కాఫే స‌మావేశాల‌కు హ‌జ‌ర‌య్యారు. అయితే.. ట‌మాటీ కాఫే అంటే ఆమె అనుకునేరు.. కాదు అత‌ను. అయితే అత‌ను.. త‌న నెల‌ల పాప‌తో పార్ల‌మెంట్ కు వ‌చ్చారు. ఇక ఆ ఎంపి పార్ల‌మెంట్ లో ప్ర‌సంగిస్తుండ‌టంతో..  ఆ నెల‌ల పాపాయి గుక్క‌పెట్టి ఎడ్వ‌డం ప్రారంబించింది. ఇది గ‌మ‌నించిన స్పీక‌ర్ ట్రెవర్‌ మలార్డ్ ..ఆకలితో ఏడుస్తున్న చిన్నారిని తన దగ్గరకు తీసుకున్నారు. తనతో పాటు స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్ చేయ‌డంతో.. ఇప్పుడు ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.  నెటిజెన్లు.. స్పీక‌ర్ పై ప్ర‌సంశ‌లు కురిపిస్తున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నా సరే ఎదుటి వారికి సముచిత గౌరవం ఇచ్చి హుందాగా ప్రవర్తించారంటూ.. స్పీక‌ర్ టైవ‌ర్ మ‌లార్డ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు నెటిజెన్లు.
.

Leave A Reply

Your email address will not be published.