News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కడసారి వీడ్కోలులో పాల్గొన్న ఆజాద్, ఉత్తమ్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ముగిశాయి. నెక్లెస్‌ రోడ్‌ పీవీ ఘాట్‌ సమీపంలో జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. జైపాల్‌ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్‌ రెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. జైపాల్‌ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, మల్లిఖార్జున్‌ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, షబ్బీర్ ఆలి, జేసీ దివాకర్‌ రెడ్డి, చిన్నా రెడ్డి, డి. శ్రీనివాస్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌రావు, నన్నపనేని రాజకుమారి, పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

jaipal

- Advertisement -

జైపాల్‌రెడ్డి విద్యార్ధి దశ నుంచే తనకు పరిచయమని ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. జైపాల్‌రెడ్డి జ్ఞానమే ఒక డిక్షనరీ అని కొనియాడారు. జైపాల్‌ రెడ్డి ఏ పదవిలో ఉన్నా పూర్తిస్థాయిలో న్యాయం చేశారని, మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. సోషలిజం, సెక్యులరిజానికి జైపాల్‌రెడ్డి సింబలని చెప్పారు. జైపాల్‌రెడ్డి బెస్ట్ పార్లమెంటేరియన్‌ అని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు మూడు దశాబ్ధాల అనుబంధం ఉందని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నామని సీపీఎం నేత ఏచూరి సీతారాం చెప్పారు.

Tags:  jaipal reddy cremation, uttam pay floral tributes, azad pay to jaipal reddy floral tributes, pcc chief uttam floral tributes to jaipal reddy , gulam nabi azad pay floral tributes to jaipal reddy, ex minister jaipal reddy cremation

Leave A Reply

Your email address will not be published.