News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాంగ్రెస్ కు గెలుపోటములు కొత్త కాదు

హైదరాబాద్: ఓటమికి కాంగ్రెస్ భయపడదని అన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి గెలుపు, ఓటమి కొత్త కాదన్న ఉత్తమ్.. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పని చేస్తూనే ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలనీ పిలుపు ఇచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి న ఉత్తమ్ ప్రసంగించారు.

Pcc chief utham Kumar Reddy on loksabha election

- Advertisement -

70 ఏళ్ల కింద నిర్మించిన అనేక ప్రజాస్వామ్య సంస్థలను ఈ ప్రభుత్వాలు విధ్వంసం చేస్తున్నాయనీ మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేసి నిర్మించిన ఈ ప్రజాస్వామ్య దేశంలో సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఎన్నికల సంఘం, సుప్రీం కోర్ట్, ఆర్బీఐ లాంటి అనేక సంస్థల పనితీరు పైన అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఉన్నాయనీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.