News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ కు ఎందుకంత‌ వ‌ణుకు..

మేము ప్రాజెక్టుల‌ను ప‌రీశీల‌స్తే.. కేసీఆర్ కు ఎందుకు అంత భ‌యం.. మొన్న కృష్ణా న‌దిపై పెండింగ్ ప్రాజెక్టుల ప‌రీశీల‌న‌కు వెళితే.. పోలీస్ ‌నిర్బందంతో మా నేత‌ల‌ను అరెస్టులు చేశారు..ఇప్పుడు మంజీర రిజ‌ర్వాయిర్ ప‌రీశీల‌న‌కు వ‌స్తే.. కేసీఆర్ ..అదే దోర‌ణీ కొనసాగిస్తున్నారు అని మండిప‌డ్డారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి, ఎండిన మంజీర రిజ‌ర్వాయిర్ ను ప‌రీశీలించేందుకు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో క‌లిసి వెళ్ళిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి పోలీసులు అడుగ‌డుగున అడ్డుప‌డ్డారు. ఉద‌యం బంజారాహిల్స్ త‌న నివాసం నుండి..జ‌గ్గారెడ్డితో క‌లిసి బ‌య‌లు దేరిన ఉత్త‌మ్ ను.. ప‌టాన్ చెరు పోలీసులు .. మంజీరా వ‌ద్ద‌కు వెళ్ళ‌కుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలిస్ స్టేష‌న్ ద‌గ్గ‌ర మూడు గంట‌ల పాటు హైడ్రామా కొనసాగింది.

- Advertisement -

మంజీరా రిజ‌ర్వాయిర్ ఎండిపోయి ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు త్రాగు నీరు లేకుండా పోయింది.. దీన్ని ప్ర‌తిప‌క్ష పార్టీ అధ్య‌క్షుడిగా తాను ప‌రిశీలించేదుకు వ‌స్తే త‌ప్పా అంటు ..? ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు ఉత్త‌మ్. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతున్న త‌మ‌ను పోలీసుల‌తో అ‌డ్డుకుని అణిచివేయాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, త‌మ‌ను ఏ సెక్ష‌న్ కింద అరెస్ట్ చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిభంద‌న‌ల‌ను సాకుగా చూపుతున్న పోలీసుల‌కు., టిఆర్ఎస్ నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు క‌నిపించ‌డం లేదా…? ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. మంత్రులు వంద‌ల మందితో.. ప్రోగ్రామ్ లు చేస్తున్నారు.. ఏకంగ సీఎం కేసీఆర్ .. వేలాది మందితో కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ ప్రారంబోత్స‌వం చేస్తే.. డీజీపీ అది క‌నిపించ‌డం లేదా .? అన్న ఉత్త‌మ్.. డీజీపి కేసీఆర్ కు తొత్తుగా మారిపోయార‌ని విరుచుకుప‌డ్డారు. మీరు అణిచివేస్తే.. భ‌య‌ప‌డేది లేద‌ని.. మ‌ళ్లీ కాంగ్రెస్ అదికారంలోకి వ‌స్తుంది.. ఇప్పుడు కేసీఆర్ అడుగుల‌కు మ‌డుగులు వ‌త్తుతున్న పోలీసుల సంగ‌తి చూస్తామ‌ని హెచ్చ‌రించారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ‌పు పాల‌న అంతం కాక త‌ప్పుదు అన్నారు ఉత్త‌మ్.

Leave A Reply

Your email address will not be published.