News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ క్యాబినెట్ లో సామాజిక న్యాయం ఎక్క‌డ ..!

హైద‌రాబాద్ : కేసీఆర్ క్యాబినెట్  కూర్పు పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.  ఇప్పుడూ అప్పుడూ అంటూ నాన్చిన మంత్రుల ప్ర‌మాణ స్వీకారానికి ఎట్ట‌కేల‌కు శుభం కార్డ్ ప‌డ్డాగానీ .. దానిపై పొలిటిక‌ల్ స్కిల్ లో మాత్రం చ‌ర్చ ఆగ‌డం లేదు. గులాబీ ద‌ళ‌ప‌తి క్యాబినెట్ కూర్పులో సామాజిక న్యాయం లోపించింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు ఇది కూడా ఓ ఉద‌హార‌ణ‌గా చెప్పుకుంటున్నారు సామాన్యులు.

KCR CABINET

కేసీఆర్ క్యాబినెట్ లో బీసీల‌కు మూడూ మూడు సీట్లు ఇచ్చి పండ‌గ చేసుకోమ‌న్న‌ట్లుగా ఉంద‌ని బీసీ ప్ర‌జాప్ర‌తినిధులు .. బీసీ సంఘాలు .. ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక తెలంగాణ లో అత్యంత ఎక్కువ జ‌నాభా ఉన్న మాదిగ సామాజిక వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్ట‌డం పై కూడా విమ‌ర్శ‌ల‌కు తీవిస్తోంది. ఇక అగ్ర‌వ‌ర్ణాల‌కు పెద్ద పీఠ వేయ‌డంపై కేసీఆర్ ఫ్యూడ‌ల్ మ‌న‌స్థ‌త్వానికి నిద‌ర్శ‌మంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

- Advertisement -

KCR CABINET

ఇక గ‌త క్యాబినెట్లో మ‌హిళ‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శ‌ల పాలైయ్యినా .. కేసీఆర్ ఈ సారి కూడా అదే పంథాను కొన‌సాగించారు. ఈ సారి కూడా త‌న క్యాబినెట్ లో మ‌హిళ‌ల‌కు చోటు క‌ల్పించ‌లేదు. ఇత‌ర మ‌హిళ‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే .. త‌న కూతురు క‌విత ప్ర‌ధాన్య‌త త‌గ్గుతుంద‌నే  భావ‌న‌తోనే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.

KCR CABINET

Leave A Reply

Your email address will not be published.