News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్.. ద‌ళితులను చంపేస్తున్నారు..


తెలంగాణ‌కు ద‌ళితున్ని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పి అదికారంలోకి వ‌చ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఆ ద‌ళితుల‌నే బ‌లి తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి . మంథ‌నిలో శీలం రంగ‌య్య‌, మ‌ల్లారంలో రాజ‌బాబును బ‌లితీసుకుంటే.. ఇప్పుడు ఏకంగా సీఎం త‌న‌ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో.. న‌ర్సింహుల‌ను బ‌లి తీసుకున్నార‌ని ఆరోపించారు. ద‌ళితుల‌కు రాష్ట్రంలో ర‌క్ష‌ణ‌ లేకుండా పోయింద‌న్న ఉత్త‌మ్ కుమార్ .. త్వ‌ర‌లోనే దీనిపై గ‌వ‌ర్న‌ర్ ను, జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ ను క‌లిసి పిర్యాదు చేస్తామ‌న్నారు.జూమ్ యాప్ లో కాంగ్రెస్ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడిన ఉత్త‌మ్.. కేసీఆర్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తీరుపై నిప్పులు చెరిగారు.

త‌న భూమిని దౌర్జ‌న్యంగా లాక్కునందుకే.. సిఎం నియోజ‌వ‌ర్గంలో బ్యాగ‌రి న‌ర్సింహులు అనే ద‌ళిత రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని.. కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఇంత దారుణాలు జ‌ర‌గుతుంటే ఆవేద‌న క‌ల్గ‌నుంద‌ని అన్నారు ఉత్త‌మ్. న‌ర్సింహులు మ‌ర‌ణ వాంగ్మూలం చూసి కేసీఆర్ సిగ్గుతో త‌ల ‌దించుకోవాలి అన్నారు. ఇక సిద్దిపేట క‌లెక్ట‌ర్ ఓ ..రియ‌లెస్టేట్ ఎజెంట్క అని మండిప‌డ్డారు ఉత్త‌మ్ . క‌‌లెక్ట‌ర్, కేసీఆర్ ఫ్యామిలీ క‌లిసి జిల్లాలో రియ‌లెస్టేట్ చేస్తున్నార‌ని ఆరోపించారు. బ్యాగ‌రి న‌ర్సింహుల‌కు చెందిన 13 గుంట‌ల భూమి రైతు వేదిక‌కు లాక్కుని.. ఇప్పుడు చ‌నిపోయిన త‌ర్వాత మంత్రి హరీష్ ఎక‌రా భూమి ఇస్తామ‌ని చెప్ప‌డం సిగ్గు చేటని అన్నారు. మ‌హూబూబ్ న‌గ‌ర్ లో ఇసుక మాఫియాను ప్ర‌శ్నించిన .. జి. న‌ర్సింహ్మను లారీతో తొక్కించి చంపేశారన్న ఉత్త‌మ్… .ఇలా రాష్ట్ర వ్యాపంగా.. ప్ర‌తి రోజు ద‌ళితుల‌ను టిఆర్ఎస్ చంపేస్తున్నారని అన్నారు. సిఎం నియోజ‌వ‌ర్గంలో చ‌నిపోయిన ద‌ళిత రైతు న‌ర్సింహ్మ‌, పాల‌మూర్ లో లారితో తొక్కించి చంపేయ‌బ‌డ్డ జీ. న‌ర్సింహులవి ముమ్మాటికి ప్ర‌భుత్వ హ‌త్య‌లే అన్న ఉత్త‌మ్ ., బాదిత ద‌ళిత కుటుంబాల‌కు న్యాయం జ‌రిగే విధంగా.. కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.