News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ పై కాంగ్రెస్ ‘క‌రెంట్’ పోరు..


కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న వైఫ‌ల్యంతోనే.. వినియోగ‌దారుల‌పై క‌రెంట్ బిల్లుల భారం ప‌డింద‌ని ఆరోపించారు పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. పెంచిన విధ్యుత్ బిల్లుల‌కు నిర‌స‌నగా.. ఈనెల 6 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ తో ఉపాదికోల్పోయిన ప్ర‌జ‌ల‌పై క‌రెంట్ బిల్లుల భారం ఎలా మోపుతార‌ని ప్ర‌శ్నించిన ఉత్త‌మ్.. బిపిఎల్ కుటుంబాల‌ను.. చిన్న వ్యాపారుల‌కు బిల్లుల‌ను మాఫి చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమలుచేసిన‌ టెలిస్కోపిక్ విదానంలోనే బిల్లుల‌ను వ‌సూల్ చేయాల‌ని అన్నారు. ఉత్త‌మ్ త‌న నివాసంలో.. సీఎల్పి నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ష‌బ్బీర్ ఆలీ, నాగం జ‌నార్దన్ రెడ్డిల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడిన ఉత్త‌మ్ కేసీఆర్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ ప‌క్క‌న ఉన్న కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ కాలువ‌కు గండిప‌డితే.. సిగ్గ‌లేకుండా మంత్రులు స‌మ‌ర్థించుకుంటున్నార‌ని విరుచుకుప‌డ్డారు ఉత్త‌మ్. క‌మీష‌న్ ల‌కోస‌మే.. మంత్రులు, అదికారులు కాంట్రాక్ట‌ర్ ల‌ను వెన‌కేసుకొస్తున్నారని ఆరోపించారు. త‌మ క‌మీష‌న్ వ‌స్తే చాలు.. కాంట్రాక్ట‌ర్లు నాసిరాకం ప‌నులు చేసిన ప‌ర్వాలేదు అన్న‌ట్లు కేసీఆర్ వ్య‌వ‌వ‌హ‌రిస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి గా అవనితిమయం అయిపోయాని విమ‌ర్శించారు ఉత్త‌మ్. అర్హ‌త లేని వారికి టెండ‌ర్లు క‌ట్ట‌పెట్టిన పాప‌మే.. ఇప్పుడు కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ కు గండికొట్టింద‌ని అన్నారు. దుమ్ముగడెం ప్రాజెక్టు టెండర్లను.. .. మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా..ఎల్ అండ్ టీ కంప‌నీకి ఇచ్చార‌న్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి .. ఈ టెండ‌ర్ల‌లో కేసీఅర్ కి 8 శాతం వాటా అందింద‌ని ఆరోపించారు. ఈవ్య‌వ‌హారంపై త్వ‌ర‌లోనే గవర్నర్ కు పిర్యాదు చేస్తామ‌న్న పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్… కాంగ్రెస్ పై ఆరోప‌ణ‌లకు ఫ‌రిమితం అవుతున్న బిజేపీ నేత‌ల‌కు కేసీఆర్ చేస్తున్న అవినీతీ క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు.

అవ‌స‌ర‌మైతే.. కేసీఆర్ అవినీతీకి సంబందించిన ఆధారాల‌ను .. బిజేపీ నేత‌లు జేపీన‌డ్డా, రాంమధవ్ కు ఇచ్చేందుకు రెడీ అన్న ఉత్త‌మ్… బిజేపీకి చిత్త‌శుద్ది ఉంటే .. కేసీఆర్ అవినీతీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.ఇప్ప‌డు కేసీఆర్ అవినీతీలో భాగ‌స్వామ్యులైన ప్ర‌తి అదికారి భ‌విష్య‌త్ లో జైలుకు వెళ్ళ‌డం ఖాయ‌మ‌ని అన్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇక అంతర్జాతీయంగా.. క్రూడ్ అయిల్ ధ‌ర‌లు త‌గ్గినా.. డిజీల్, పెట్రో ధ‌ర‌లు ద‌గ్గించ‌కుండా.. గ‌డిచిన ఆరేళ్ల‌లో.. మోడి 18 లక్షల కోట్ల రూపాయలు ఎక్సయిజ్ సుంకం ద్వారా ప్ర‌జ‌ల‌నుండి దోచుకున్నార‌ని అన్నారు ఉత్త‌మ్.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.