News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

క‌రోనా కు మందు వ‌చ్చేసింది..


ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్ మార్క్ ఫార్మాసుటిక్స్ కంపెనీ ప్రకటించింది. యాంటీవైరల్​ డ్రగ్​ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం ‘ఫవిపిరావీర్​ బాగా ప‌నిచేస్తుంద‌ని ప్రక‌టించింది గ్లెన్​మార్క్. ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్… గరిష్ఠ రిటైల్ ధర రూ.3వేల 500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా రోజుకు 4ట్యాబ్లెట్లు వేసుకోవాలని.. తొలి రోజు మాత్రం 200mg ట్యాబ్లెట్లు 9 తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. కరోనా పేషెంట్ల మీద 80శాతం కచ్చితత్వంతో ఈ మందు పనిచేస్తుందని చెప్తున్నారు. వైరస్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని ప్ర‌క‌టించింది గ్లెన్ మార్క్ సంస్థ‌

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.