News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గాలికి ఎగిరిపోయిన కేఏ పాల్ హెలికాప్టర్

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఈ ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన కేఏ పాల్ ఎన్ని సీట్లు గెలుస్తారో ఆని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ చేసిన చిత్రి విచిత్రమైన కామెడీ ట్రిక్కులకు జనం పగలబడి నవ్వుకున్నారు. అంతే కాదు ఓ దశలో పాల్ కు ఏమైనా పిచ్చి పట్టిందా అన్న సంహేదాలు వ్యక్తం అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో ఐతే కేఏ పాల్ తెగ హల్ చల్ చేశారు. అంతా చేశాక ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం కేఏ పాల్ కు షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.

- Advertisement -

కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఏపీలో ఎక్కడా కూడా కేఏ పాల్ పార్టీకి 300కు ఓట్లు మించి రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన పాల్‌ కు కేవలం 281 ఓట్లు పోలయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతుంది. అటు పాల్ పోటీ చేసిన నర్సాపురం లోక్‌సభ స్థానంలో కూడా కేవలం 2 వేల 987 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐతే తమ పార్టీ హెలికాప్టఱ్ గుర్తు కావడంతో.. ఓటర్లు భ్రమ పడి వీసీపీ గుర్తు ఫ్యాన్ కు ఓటేశారని కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు.

Leave A Reply

Your email address will not be published.