News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గులాబీ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ ..!

హైద‌రాబాద్ : కేసీఆర్ కేబినెట్‌లో త‌మ‌లో ఎవ‌రికి స్థానం ద‌క్కుతుంది .. ఇప్పుడు ఇదే గులాబీ ఎమ్మెల్యేల మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌. పాత వారిలో ఎంద‌రికి అవ‌కాశం క‌ల్పిస్తారు .. కొత్త వారిని ఎంత మందిని తీసుకుంటారు .. అస‌లు ఒకే ద‌ఫాలో పుల్ క్యాబినెట్ కొలువుదీరుతుందా .. లేక మ‌రో విడ‌త విస్త‌ర‌ణ ఉంటుందా .. పార్టీలో ఇప్పుడు ఇక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. విస్తరణకు డేట్ ఫిక్స్ చేసిన కేసీఆర్.. ఎవరెవరికి చోటు కల్పిస్తారనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు. దీంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో హైదరాబాద్ లో మకాం వేసి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు.

trs mlas
ఇక కేబినెట్ లో బెర్త్ కోసం ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యేలు .. అసలు సీఎం కేసీఆర్ పరిశీలనలో తమ పేర్లు ఉన్నాయా .. లేవా .. అంటూ ఆరా తీసే ప‌నిలో బిఇజీగా ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు  మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరినా.. కేబినెట్ లో ఎంతమందికి చోటు దక్కుతుందన్నదానిపై క్లారిటీ లేదు. తొలి దఫాలో 6 నుంచి 10 మంది .. లేకుంటే పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటు చేస్తారన్నదానిపై చర్చ జరుగుతోంది. కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా అధికారికంగా వెల్లడి కాలేదు. జిల్లాలు .. సామాజిక అంశాలను బేరేజు వేసుకుని ఎవరికి వారే తమకు మంత్రిపదవి ఖాయమన్న ధీమాలో ఉన్నారు.

- Advertisement -

trs mlas

Leave A Reply

Your email address will not be published.