News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గెలుపు కోసం క్షేత్ర‌స్థాయి మేధో మ‌ద‌నం ..!

హైద‌రాబాద్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంలో పిసిసి పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎన్నిక‌ల వ్యూహం ఖ‌రారు చేసేందుకు మేధో మ‌ద‌నం చేసింది. 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు ఎఐసిసి కార్య‌ద‌ర్శులుగా ఉన్న ముగ్గురు ఇంచార్జ్‌ల ప‌రిధిలోని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. 15న శ్రీ‌నివాస కృష్ణ‌న్, 16న స‌లీం, 17న బోసురాజు ఎఐసిసి కార్య‌ద‌ర్శులుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలిలో  శుక్ర‌, శ‌ని, ఆదివారాల‌లో జ‌రిగిన స‌మావేశాలు ఆదివారం ముగిశాయి. ఆదివారం నాడు చేవేళ్ళ‌, మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైద‌రాబాద్‌,మెద‌క్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాలు నిర్వ‌హించారు. ఎఐసిసి ఇంచార్జ్ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి  రాంచంద్ర కుంటియా, టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సిఎల్పీ నేత  భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎఐసిసి కార్య‌ద‌ర్శి బోసురాజు, ఎఐసిసి కార్య‌ద‌ర్శులు వంశీ చంద‌ర్ రెడ్డి, ఎం.పి విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ఎం.ఎల్‌.ఎలు మాజీ మంత్రి స‌బితా ఇంద్రారె్డి, పైల‌ట్‌ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు కార్య నిర్వ‌హాక అధ్యక్షులు కుసుమ కుమార్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు పాల్గొన్న ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో రాబోయే ఎన్నిక‌ల‌లో అనుస‌రించాల్సిన వ్యూహం గురించి లోతైన చ‌ర్చ జ‌రిపారు.

uttam

ఈ స‌మావేశంలో టిపిసిసి అధ్యక్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌.సి కుంటియా లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో అనేక కార‌ణాల‌తో ఓట‌మి పాల‌య్యామ‌ని, టిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండ‌డంతో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని, పెద్ద ఎత్తున అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుల‌ను విచ్చ‌ల‌విడిగా వ్య‌యం చేసింద‌ని, ఓట‌ర్ల తొల‌గింపులోను, ఈవీఎం ల్లో అనేక అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కాంగ్రెస్‌పార్టీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు సంపూర్ణంగా ఉన్న‌ప్ప‌టికీ టిఆర్ఎస్ చేసిన అవినీతి అక్ర‌మాల‌తోనే టిఆర్ఎస్ విజ‌యం సాధించ‌గ‌లిగింద‌ని అన్నారు. కానీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌ని, జాతీయ సమ‌స్య‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని అందుకే టిఆర్ ఎస్ అసెంబ్లీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళింద‌ని అన్నారు. ప్ర‌ధానంగా నాయ‌కులు ఈ ఎన్నిక‌ల‌ను రాహుల్‌, మోడి మ‌ధ్య జ‌రిగే జాతీయ ఎన్నిక‌లుగా ప్ర‌చారం చేయాల‌ని, మోడిపైన తెలంగాణ ప్ర‌జ‌ల‌లో పెద్ద‌గా విశ్వాసం లేద‌ని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింద‌నే న‌మ్మ‌కం, తిరిగి కాంగ్రెస్ గెలిపిస్తే తెలంగాణ అభివృద్ది అవుతుంద‌నే విశ్వాసం జ‌నంలోకి క‌ల్పించాల‌ని సూచించారు. తెలంగాణ‌లో బిజెపి బ‌లంగా లేనందున బిజెపి కేంద్రంలో గెలిచినా తెలంగాణ అభివృద్ది జ‌ర‌గ‌లేద‌ని, టిఆర్ఎస్ బిజెపి ముగుసులో ఉన్న పార్టీ అని, మోడి కి కేసిఆర్ భ‌య‌ప‌డుతార‌ని, కేసిఆర్‌పైన ఉన్న సిబిఐ కేసుల‌తో మోడితో కేసిఆర్ పోరాటానికి పోవ‌డం లేద‌ని, దాంతో తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి స‌హాయం అంద‌కుండా పోయింద‌ని ఈ విష‌యంలో కేసిఆర్ పోరాటానికి సిద్ద‌ప‌డ‌డం లేద‌ని నాయ‌కులు స‌మీక్ష‌లో వివ‌రించారు.

uttam

- Advertisement -

అందువ‌ల్ల మోడి, కేసిఆర్‌లు ఒక్క‌టేన‌ని, కేంద్రంలో మోడి రాహుల్ మ‌ధ్య‌నే ఎన్నిక‌ల పోటీ ఉన్నందున రాహుల్‌ను ప్ర‌దాని చేయ‌డం కోసం తెలంగాణ స‌మాజం క‌లిసి రావాల‌నే వ్యూహంతో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నాయ‌కులు సూచించారు. అలాగే న‌రేంద్ర‌మోడి గ‌త ఎన్నిక‌ల‌లో ఇచ్చిన ఒక్క ఎన్నిక‌ల హామీ నెర‌వేర్చ‌లేద‌ని, న‌ల్ల‌ధ‌నం విదేశాల నుంచి తీసుకొని వ‌చ్చి ప్ర‌తి పౌరుడి ఖాతాలో 15 ల‌క్ష‌లు జ‌మ చేస్తాన‌ని చెప్పిన మోడి త‌రువాత న‌ల్ల‌ధ‌నం సంగ‌తి అటు ఉంచి న‌ల్ల‌ద‌నం కుబేరుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని, బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టిన వ్యాపార‌వేత్త‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని నాయ‌కులు విమ‌ర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పిన మోడి రెండు ల‌క్షల ఉద్యోగాలు కూడా ఇవ్వ‌లేద‌ని, నిత్య‌వ‌స‌ర  ధ‌ర‌ల పెంపు విష‌యంలో ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని, పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్య‌లు చాల క‌ష్ట ప‌డ్డార‌ని, జి.ఎస్‌.టి ప‌న్నుల పెంపుల‌తో సామాన్యుల‌కు భారం పెరిగింద‌ని ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించి ఓట్ల‌ను రాబ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

uttam

దేశంలో మ‌త త‌త్వ రాజ‌కీయాల‌కు ఆజ్యం పోసి రాజ‌కీయంగా బిజెపి లాభ‌ప‌డుతుంద‌ని, ఒక వ‌ర్గాన్ని ల‌క్ష్యంగా  చేసుకొని వారి వ్యక్తిగ‌త అంశాల‌లో రాజ‌కీయాలు చేస్తుంద‌ని దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత ఘోరంగా మ‌తాన్ని ల‌క్ష్యంగా చేసుకొని ఎవ‌రు పాలించ‌లేద‌ని నాయ‌కులు వివ‌రించారు. అందువ‌ల్ల ముస్లీంఓట్ల‌ను బిజెపికి వ్య‌తిరేకంగా లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్ వైపు వ‌చ్చేలా కృషి చేయాల‌ని సూచించారు. అలాగే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో దాదాపు 22 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌బ‌డ్డాయ‌ని ఈ విష‌యంలో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ కూడా క్ష‌మాప‌ణ చెప్పార‌ని అయితే తొల‌గించిన ఓట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చేర్పించేందుకు బి.ఎల్‌.ఎల‌ను నియ‌మించుకోవాల‌ని ఈ విష‌యంలో నాయ‌కులు గ‌తంలో నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఈ సారి ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.