News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గోవా బ్యూటీ కోరికను తీరుస్తున్న చిరు

గోవా అందాల సుందరి ఇలియానా కోరిక ఇన్నాళ్లకు తీరబోతోంది. అదేంటీ ఈ సుందరికి ఏం కోరికలుంటాయి.. ఉన్నా అవి తీరకపోవడమేంటీ అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఇలియానాకు ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. గత కొన్ని రోజులుగా ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కావడం లేదు. అంతే కాదు సినిమాలు లేక ఇలియానా కాస్త బొద్దుగా కూడా అయ్యిందట. దీంతో ఇలియానాతో సినిమాలు చేసేందుకు ఇటు హీరోలు.. అటు దర్శకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్.
iliana
ఇదిగో ఇలాంటి సమయంలో ఇలియానాకు గోల్టెన్ ఛాన్స్ వచ్చింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హిరోయిన్ గా వెలుగొందిన ఇలియానా.. మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించలేదు. ఆమెకు అది తీరని కోరికగానే ఉండిపోయింది. ఇదిగో ఇన్నాళ్లకి ఆ కోరిక తీరబోతోంది. సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన నటించేందుకు ఇలియానాను ఎంపిక చేయాలని నిర్ణయించారట. ఇంకేముంది ఈ గోవా బ్యూటీ ఎగిరి గంతేసి ఒప్పేసుకుందని తెలుస్తోంది. మొత్తానికి ఇలియానా కోరికను చిరంజీవి తీరుస్తున్నాడన్నమాట.

- Advertisement -

Tags: iliana, actress iliana, iliana acting with chiranjeevi, iliana movie with chiranjeevi, actress iliana shooting with chiranjeevi

Leave A Reply

Your email address will not be published.