News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

చంద్రయాన్-2 పై గ్రోబల్ స్టార్ స్పందన

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంపై గ్లోబల్‌ స్టార్‌.. అందాల భామ ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. ఈనెల 22న ఇస్రో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 రాకెట్‌ సాయంతో చంద్రయాన్‌ 2ను చంద్రుడిపైకి పంపించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ప్రియాంక చోప్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. చంద్రయాన్‌ 2 విజయం వెనకున్న మహిళా శాస్త్రవేత్తలు రీతూ కరిధాల్‌, ముత్తయ్య వనిత మనకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. తాను శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నానన్న ప్రింయాక… వీరిద్దరినీ చూశాక కలలు నిజమవుతాయని అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇస్రో టీంను చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొంది ప్రియాంక చోప్రా.

- Advertisement -

Tags: priyanka chopra, isro, priyanka chopra about chandrayan, priyanka chopra on chandrayan, actress priyanka chopra about chandrayan-2, global star priyanka chopra about chandrayan-2

 

Leave A Reply

Your email address will not be published.