News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

చర్యకు ప్రతి చర్యలుంటాయి

కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తొలిసారి స్పందించారు. పుల్వామా దాడికి సంబందించి ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తోందని ఇమ్రాన్‌ ఆరోపించారు. అంతే కాదు భారత్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశాడు. ఉగ్రదాడితో పాక్‌కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశాడు. ఇలాంటి దాడి చేస్తే మాకేం ప్రయోజనమని ఎదురు ప్రశ్నించిన ఆయన.. తాము ఉగ్రవాదాన్ని కాదు.. స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండన్న ఇమ్రాన్ ఖాన్.. ఏం ఆధారాలున్నయాని భారత్‌ మాపై ఆరోపణలు చేస్తోందని ప్రశ్నించారు. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో తాము ఇదివరకే లక్షలాది మందిని కోల్పోయామని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే అన్న దాయాది దేశ అధినేత.. ఆ యుద్ధం ఎక్కడ ముగుస్తుందన్నది ఆ దేవుడికే తెలియాలని కామెంట్ చేశాడు. సమస్యలను సామరస్యమైన చర్చలతోనే పరిష్కరించుకోవాలన్న ఇమ్రాన్ ఖాన్.. దాడి చేస్తే పాకిస్థాన్ ప్రతిఘటించదని భారత్‌ భావిస్తోందని.. కానీ మీ చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.