News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణకు డాక్టర్ తమిళిసై

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది. తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ నియమించారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా డాక్టర్. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో 1961 జూన్ 2న తమిళిసై సౌందరరాజన్ జన్మించారు. ఆమె తండ్రి అనంతన్ పార్లమెంటు మాజీ సభ్యుడే కాకుండా, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత .

తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు. అంతే కాదు తమిళిసై భర్త సౌందరరాజన్ కూడా డాక్టరే. చిన్నతనం నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంటున్న రోజుల్లోనే విధ్యార్ధి నాయకురాలిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలవలేదు.

- Advertisement -

Tags: ts governor, telangana governor, telangana new governor, telangana governor tamilisai soundararajan, telangana new governor talilisai soundararajan, tamilisai soundararajan, tamilisai soundararajan telangana new governor

Leave A Reply

Your email address will not be published.