News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దేవ్ సినిమా రివ్యూ

సినిమా- దేవ్

నటీనటులు- కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కి గ‌ల్రాని త‌దిత‌రులు

సంగీతం- హేరీష్ జైరాజ్‌

నిర్మాత‌లు- ఠాగూర్ మ‌ధు, ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌

కధ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం- ర‌జ‌త్ ర‌విశంక‌ర్‌

పరిచయం………………

తమిళ హీరో కార్తి.. ఆవారా, నా పేరు శివ‌, యుగానికొక్క‌డు, ఖాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచతమే. కార్తి న‌టించిన సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలవతుంటాయి. ఇదిగో ఇప్పుడు తాజాగా కార్తి న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ దేవ్‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కార్తి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కధలను ఎంచుకుంటుంటాడు. మరిప్పుడు దేవ్ తో మన ముందుకు వచ్చాడు. మరి దేవ్ సినిమా ఎలా ఉందో చూసేద్దామా….

dev

దేవ్ కధ………

- Advertisement -

- Advertisement -

ఇక కధలోకి వెళ్తే.. దేవ్‌ (కార్తి) త‌నకిష్టమైన ప్రదేశాలు తిరుగుతూ.. తన మనసుకు నచ్చినట్లు ఉంటాడు. అంతే కాదు ఎలాగూ చాలా ప్రదేశాలకు వెళ్తుంటాడు కాబట్టి.. ఫ్రీలాన్స్ ఫోటో జ‌ర్న‌లిజం కూడా చేస్తుంటాడు దేవ్. ఇక అత‌నికి విఘ్నేష్‌ (ఆర్‌.జె.విఘ్నేష్‌కాంత్‌), నిషా(అమృత‌) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఈ టార్లన్నీ ముగ్గురు క‌లిసే వెళ్తుంటారు. ఇక ఈ క్రమంలోనే విఘ్నేష్ కార‌ణంగా దేవ్ పేస్‌బుక్‌లో ఒక‌రికి అనుకోకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. ఐతే తాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది మేఘ‌న(ర‌కుల్ ప్రీత్ సింగ్‌) కని ఆ త‌ర్వాత తెలుస్తుంది. తన చిన్నప్పుడే తండ్రి త‌ల్లిని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ మేఘ‌న పాతికేళ్ల వ‌య‌సులో త‌న టాలెంట్ తో బిజినెస్ ఉమెన్ స్థాయికి ఎదుగుతుంది. ఇంకేముంది అందమైన మేఘనను ప్రేమించ‌డానికి దేవ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు.

రోటీన్ గానే దేవ్ అంటే తొలుత పెద్దగా ఆస‌క్తి చూప‌ని మేఘ‌న, ఆ త‌ర్వాత అత‌ని ప్రేమలో పడుతుంది. ఐతే అనుకోని పరిస్థితుల్లో దేవ్ మేఘనతో మాట్లాడ‌లేక‌పోతాడు. ఇంకేముంది మేఘ‌న త‌న‌ను దేవ్ పట్టించుకోవడం లేదని, అత‌నితో గొడ‌వ‌పడుతుంది. దేవ్ తనకు ఎంత న‌చ్చ‌చెప్పినా మేఘ‌న మాత్రం వినిపించుకోదు. ఆ సమయంలోనే దేవ్‌కు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. మరి దేవ్ యాక్సిడెంట్ తరువాత ఎంజరుగుతుంది, మేఘన దేవ్ ను అర్ధం చేసుకుంటుందా, చివరకు మేఘన.. దేవ్ కలుస్తారా లేదా అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే…

 

ఎలా ఉందంటే…………..

సాధారనంగానే హీరే కార్తి విభిన్నమైన కధలకు బాగా న్యాయం చేస్తాడు.  వైవిధ్య‌మైన పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతాడు. డైరెక్టర్ ర‌జ‌త్ చెప్పిన కాన్సెప్ట్‌ను న‌మ్మి దేవ్ సినిమా చేశాడు కార్తి. ఈ సినిమాలో తన పాత్ర‌కు త‌గ్గ‌ట్టు కార్తి బ‌రువు త‌గ్గాడు కూడ. ప్రేమ కోసం.. ప్రియురాలి కోసం పరితపించే ప్రేమికుడిగా కార్తి త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌ను ఈ చిత్రంలో చేసింద‌నే చెప్పవచ్చు. కాస్త సీరియ‌స్‌గా సాగే పాత్ర‌కు రకుల్ న్యాయం చేసింది.

dev

కార్తి స్నేహితుడిగా న‌టించిన విఘ్నేష్‌, అమృత పాత్ర‌లకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. ఇక హీరో కార్తి తండ్రిగా న‌టించిన ప్రకాష్‌రాజ్‌, హీరోయిన్ త‌ల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ పాత్ర‌లు అంతంత మాత్రే. అంత పెద్ద న‌టీనటులను అలాంటి ప్రాధాన్యం లేని పాత్ర‌ల‌కు ఎందుకు తీసుకున్నారో అర్దం కాని ప్రశ్న. డైరెక్టర్ ర‌జ‌త్ ర‌విశంక‌ర్ సినిమాలో ఎమోష‌న్‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. హేరీష్ జైరాజ్ సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి దేవ్ సినిమా కార్తి ఎందుకు చేశారో ఎవరికి అర్ధం కావడం లేదు.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

నోట్. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

Leave A Reply

Your email address will not be published.