News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నవభారత్ నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి ..!

హైదరాబాద్ : రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకువెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్‌ గాంధీ 75వ జయంతి ఉత్సవాలను గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గాంధీ .. నెహ్రు కుటుంబాలు చేసిన త్యాగాలను బీజేపీ తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమిత్ షా నెహ్రూని కించ పరిచేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాజీవ్‌ గాంధీ కృషి చేశారని ఉత్తమ్ కొనియాడారు. బీసీ రిజర్వేషన్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆయన ఆరోపించారు.

Uttam

ఇక రాజీవ్‌ గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి రాజీవ్‌ గాంధీ సేవలను కొనియాడారు.

- Advertisement -

Uttam

కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్​ కొణిజేటి రోశయ్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్​ చౌహాన్​, రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి కుంతియా,మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.