News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నాగుల పంచమి రోజు అరెస్టులు తప్పవా ..!

వ‌చ్చే నాలుగుల పంచ‌మికి మీరు పాము ప‌ట్ట‌లో పాలు పోసి పుణ్యం కొట్టేయాల‌నుకుంటున్నారా..? అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఆరోజు పాలు పోస్తే.. మీకు ద‌క్కేది పుణ్యం కాదు.. మీరు ఏకంగా జైలు ఊచ‌లే లెక్క‌పెడ‌తారు. అదేంటీ అనుకుంటున్నారా… అవును.. మూఢ‌న‌మ్మ‌కాల‌తో పాముల‌ను హింసీస్తే మీమ్మ‌ల్ని జైలుకు పంపేందుకు రెఢీ అవుతున్నారు పోలీసులు.

Nagula panchami

పాము.. హిందు సంస్కృతిలో పామును దైవంగా కొలుస్తారు. ఇక నాగులు పంచ‌మి వ‌స్తే చాలు…పాము పుట్టలో పాల‌ను పోసి.. ఆ నాగ‌దేవుడికి త‌మ కోర్కెల‌ను భ‌క్తులు విన్న‌వించుకుంటారు ఇలా చేస్తే.. పుణ్యం ద‌క్కుతుంద‌ని .. భ‌క్తుల ప్ర‌గాఢ‌ విస్వాసం. అయితే నాగుల పంచ‌మి.. వ‌చ్చే నెల 5 వ తేదిన రాబోతుంది. ఇంకేముందు.. ఏడాదిగా నాగ‌రాజు క‌టాక్షం కోసం ఎదురుచూస్తున్న భ‌క్తులు.. నాగు పాముల‌కు పూజ‌లు చేసి పుణ్యం కొట్టేసేందుకు రెఢీ అవుతుంటారు. అయితే.. ఈసారి అదే చేస్తే.. మీమ్మ‌ల్ని జైలుకు పంపేందుకు రెఢీ అవుతున్నారు పోలీసులు. ఇదేంటీ పండుగ చేసుకుంటే.. జైలేంటీ అనుకుంటున్నారా.. అదే అక్క‌డి కే వ‌స్తున్నా… నాగుల పంచ‌మి రోజు.. మీరు ఇంట్లో ఎన్ని పూజ‌లైన చేసుకోండి.. కాని పాము పుట్ట‌లో పాలు పోస్తే మాత్రం ఊర్కోం అంటు హెచ్చ‌రిస్తుంది తెలంగాణ ప్ర‌భుత్వం.

Nagula panchami

- Advertisement -

అవును… పాములు పాలు త్రాగుతాయ‌ని.. ఆరోజు వాటికి పాలు పోస్తే త‌మ‌కు పుణ్యం వ‌స్తుంద‌ని భావిస్తున్న భ‌క్తుల‌కు వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. పాముకు పాలు పోసీ .. వాటి ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడ‌వ‌ద్ద‌ని అంటుంది అట‌వీ శాఖ అదికారులు. పాములు పాలు త్రాగ‌డం అంతా ట్రాష్ అంటున్న అధికారులు.. అలా పాలు పోస్తే.. వ‌ణ్య‌ప్రాణి చ‌ట్టం ప్ర‌కారం.. అది నేరం అంటున్నారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడే పాముల‌ను ప‌ట్టి హింసిస్తే.. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం జైలుకు పంపుతామంటున్నారు . నాగుల పంచ‌మి వ‌స్తుడంతో.. ఇదే విష‌యాన్ని ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో.. భ‌క్తుల‌కు హుకూం జారిచేశారు. అంతేకాదు.. మూఢ‌న‌మ్మ‌కంతో పాముల‌కు పాలు పోసి వాటిని హింసిస్తే జైలుకు పంప‌డం ఖాయ‌మ‌ని తేల్చిచెప్పారు. దీనిపై పిర్యాదు స్వీక‌రించేందుకు ప్రత్యేకంగా.. టోల్ ఫ్రీ నంబ‌ర్-1800 425 5364 ఏర్పాటు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

Nagula panchami

అయితే ప్ర‌భుత్వం తీరు భ‌క్తుల‌ మ‌నోభ‌వాలు దెబ్బ‌తీసే విదంగా ఉన్నాయ‌న్న‌విమర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఒకవైపు భ‌క్తుల విస్వాసం.. మ‌రోవైపు ప్ర‌భుత్వం చెబుతున్న‌ చ‌ట్టం.. ఈ రెండింటి మ‌ధ్య వ‌చ్చే నాగుల పంచ‌మి ఎలా సాగ‌నుందో చూడాలి.

Tags:NAGULA PANCHAMI FESTIVAL, SNEAKERS,SNEAKS,TEMPULS, TELANGANA GOVERNMENT,CM KCR, HYDERABAD, PUBLIC,HINDU FESTIVALS

 

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.