News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నా కలలన్నీ నెరవేరాకే

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనేం లేదని చెప్పేసింది మహానటి.. అందాల భామ కీర్తిసురేష్‌. మహానటి సినిమాతో భారీ సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దగుమ్మ ఈ మధ్య సామి స్క్వేర్‌ సినిమాలోను  ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు తమిళ హీరో విజయ్‌కి జోడీగా సర్కార్‌ సినిమాలోను నటించి అందరిని మెప్పించింది. ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన కీర్తీ సురేష్ చేతినిండా చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఈ అమ్మడు చెప్పింది.

keerthi

- Advertisement -

చదువు పూర్తయ్యాక సరదాగా మోడలింగ్‌ చేశానని చెప్పిన భామ.. అప్పుడు ఓ మలయాళ చిత్రంలో నటించే అవకాశం వస్తే… నటించాలా.. వద్దా.. అని చాలాసార్లు ఆలోచించిందట. చివరకు ఇంట్లో అమ్మా నాన్నలచో పాటు శ్రేయోభిలాషుల  సలహా మేరకు చివరకు నటించిందట. ఇంకేముంది ఆ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టడం.. ఆ వెనువెంటనే తమిళంలో చాలా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి చూసుకోలేదు. ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన కీర్తి.. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెబుతోంది. తన కలలన్నీ నెరవేరాక అప్పుడు తనకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానంటోంది ఈ నెరజాన.

Leave A Reply

Your email address will not be published.