News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా..

సోషల్ మీడియాలో తనపై చేస్తున్నదుష్ర్పచారంపై వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసింది. తనపై అభ్యంతర వ్యాఖ్యలను చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు వైసీపీ సీనియర్‌ నాయకులతో కలిసి హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ కు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టడం బాధాకరమని, వీటి వెనుక జనసేన, టీడీపీ హస్తం ఉందని షర్మిల ఆరోపించారు.తనకు ప్రభాస్‌కు సంబంధం ఉందని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయిన షర్మిల… తన జీవితంలో ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదని.. కనీసం ఆయనతో మాట్లాడింది కూడా లేదని అన్నారు.

sharmila

- Advertisement -

తన పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారామె. 2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారాలే చేస్తే.. పోలీసులు చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఆగిందని ఈ సందర్బంగా షర్మిల చెప్పింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారన్న ఆమె.. దీని వెనుక జనసేని, తెలుగుదేశం పార్టీల హస్తం ఉందని ఆరోపించింది. ఇధి కేవలం తన ఒక్కదానికి జరిగే అవమానం కాదని.. సమాజంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమని ఆవేధన వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరింది.

Leave A Reply

Your email address will not be published.