News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నిండు కుండలా నాగార్జున సాగర్..

న్యూస్ పిల్లర్- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అంతకంతకు ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు 14 క్రస్టు గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 48 వేల 266 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 2 లక్షల 48 వేల 266 క్యూసెక్కులుగా ఉంది. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 310 టీఎంసీలుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్చు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. ఇక గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.