News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పెళ్లి తిరుపతిలోనే

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తోలి సినిమా ధడక్ తోనే సూపర్ హిట్ అందుకుంది. అదిగో అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీ దృష్టి అంతా జాన్వీపై పడింది. తాజాగా బ్రైడ్స్ టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి జాన్వీ కపూర్ చాలా విషయాలు చెప్పింది. శ్రీదేవి ఉన్నప్పుడు తన పెళ్లి గురించి  చాలా సార్లు మాట్లాడుకున్నామని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే అమ్మకు తన మీద నమ్మకం తక్కువని, తాను త్వరగా ప్రేమలో పడతానని శ్రీదేవి అభిప్రాయపడేదని చెప్పింది. కాబట్టి తనకోసం అమ్మే ఓ అబ్బాయిని చూస్తానని చెప్పేదని జాన్వీ గుర్తు చేసింది.

janvi
ఇక తనకు కాబోయేవాడికి చేసే పనిపై శ్రద్ధ, నిబద్దత ఉండాలని చెప్పింది. అతని నుంచి తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలన్న జాన్వీ.. అతనికి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా తానంటే పడి చచ్చిపోవాలని చెప్పింది. ఇక తన పెళ్లి సాంప్రదాయబద్ధంగా తిరుపతిలో జరుగుతుందన్న జాన్వీ.. పెళ్లిలో తాను కంజీవరం జరీ చీర ధరిస్తానని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత తనకు ఇష్టమైన సౌత్ ఇండియన్ వంటకాలతో అద్భుతమైన విందు ఉంటుందని.. ఆ విందులో ఇడ్లీ, సాంబార్‌, పెరుగన్నం, పాయసం వంటివి ఉంటాయని చెప్పిందీ భామ.
janvi

- Advertisement -

Tags: janvi, janvi kapoor, janvi kapoor hot, janvi kapoor about saree, janvi kapoor about marriage, janvi kapoor marriage in tirupati

Leave A Reply

Your email address will not be published.