News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పేట సినిమా రివ్యూ..

సినిమా- పేట

తారాగణం- ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్  సిద్ధిఖీ, బాబీ సింహా త‌దిత‌రులు

మ్యూజిక్- అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌

నిర్మాత‌లు- క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని

డైరెక్టర్- కార్తీక్ సుబ్బ‌రాజు

నిర్మాణ సంస్థ‌- స‌న్ పిక్చ‌ర్స్‌

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం…………..

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎందుకంటే రజనీకి ఇక్కడా అక్కడా అని ఏం లేదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. త‌న‌దైన‌ స్టైల్‌, మేన‌రిజంతో రజనీకాంత్ అందరిని మెస్మరైజ్ చేస్తాడు. తలైవా సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారంటే అతియేశక్తి కాదు. త‌మిళ‌నాడులో అయితే అభిమానులకు రజనీకాంత్ సినిమా ఒక పెద్ద పండ‌గ‌లాంటిదే అని చెప్పవచ్చు. ఒక్క తమిళే కాదు.. కన్నడ, మళయాళ, తెలుగులోనూ ర‌జ‌నీకి అభిమానులు త‌క్కువేం కాదు. అందుకే ఆయ‌న న‌టించిన ప్ర‌తి సినిమా ఏక‌కాలంలో కన్నడ, మళయాళ, తెలుగు బాషల్లోనూ విడుద‌ల‌వుతుంది. ఇక ఈ సంక్రాంతి కూడా త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ అల‌రిందుకు పేట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు రజనీకాంత్. మరి ఇంతకీ పెటాలో రజనీ ఎలా అల‌రించాడు..  యువ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు త‌న అభిమాన హీరోని తెర‌పై ఎలా ఆవిష్కరించాడు..  అన్నది చూసేద్దామా…

- Advertisement -

petta

- Advertisement -

పెటా సినిమా కధ……..

ఇక సినిమా కధలోకి వెళ్తే… కాళీ (ర‌జ‌నీకాంత్‌) ఓ కళాశాలో హాస్ట‌ల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. ఆ కాలేజ్ హాస్టల్ లో ఎదురయ్యే చాలా సమస్యల్ని త‌న‌దైన స్టైల్‌లో ప‌రిష్క‌రిస్తూ ఉంటాడు కాళీ. ఇదే క్రమంలో ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు. ఇదిగో ఈ వ్యవహారంలో అనుకోకుండా స్థానికంగా ఉండే ఓ రౌడీతో గొడ‌వ పెట్టుకుంటాడు కాళీ. ఈ గొడవ కారణంగానే అత‌ని అసలు పేరు కాళీ కాదని… పేట అని, అత‌డి స్వస్థలం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ అని  తెలుస్తుంది. కాళీకి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ లోని సింహాచ‌లం (న‌వాజుద్దీన్‌) అనే పొలిటికల్ లీడర్ తో విభేదాలు ఉంటాయి. మరా విభేదాలు ఎంటీ.. అసలు పేట కాళీగా ఎందుకు మారాడు.. అసలు కధ ఎంటో తెలియాలంటే మాత్రం పేట సినిమా తెరపై చూడాల్సిందే.

పేట ఎలా ఉందో తెలుసా…….

సాధారనంగా ర‌జ‌నీకాంత్‌ ను స్టైల్‌గా, ఎన‌ర్జీగా చూడాల‌ని ఆయన అభిమానులు కోరుకుంటారు. క‌బాలి, కాలా, 2.ఓ చిత్రాలు ర‌జ‌నీలో ఉన్న మేన‌రిజాన్ని, స్టైల్‌ను  అంచగా చూపించలేదనే చెప్పాలి. అందుకే చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ త‌న స్టైల్‌ను చూపించుకోవ‌డానికి, త‌న ఛ‌రిష్మా చూపించుకోవ‌డానికి ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్నాడని అనిపిస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కధను అల్లుకున్నాడు. త‌న క‌థ‌ల్లో చిన్న గ‌మ్మ‌త్తు ఉంటుంది. కాక‌పోతే అత‌ను కూడా ర‌జ‌నీ స్టైల్‌ను ఫాలో అయిపోతూ, ర‌జ‌నీ సినిమాకు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో క‌థ‌ను ప్రత్యేకంగా రూపొందించుకున్నాడు. సినిమా ప్రారంభ సన్నివేశారు, ర‌జ‌నీకాంత్ ప‌రిచ‌య దృశ్యాలు, హాస్ట‌ల్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఇవ‌న్నీ కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికి మాత్రమే పొందుపరిచారని ఇట్టే తెలిసిపోతుంది. ఈ స‌న్నివేశాల‌న్నీ, ఒక న‌ర‌సింహా, ముత్తు, అరుణాచ‌లం చిత్రాల్లోని ర‌జ‌నీని గుర్తుకు తెస్తాయి. ఈ క్రమంలో వచ్చే ఫైటింగ్ స‌న్నివేశాలు కూడా అలాగే స్టైల్‌గా తీశాడు. అలటాని హీరోయిన్ సిమ్ర‌న్‌తో జ‌రిగే ట్రాక్ మొత్తం రజనీకాంత్ లోని రొమాంటిక్ రోల్ ని గుర్తుచేస్తుంది. సినిమా ఇంటర్వెల్ వ‌ర‌కూ అసలు కధే ఏంలేదని చెప్పవచ్చు. ఇంటర్వెల్ వరకు ర‌జ‌నీకాంత్ అభిమానుల‌ను మెప్పించ‌డానికి మాత్రమే స‌న్నివేశాల‌ను రూపొందించాడు దర్శకుడు.

petta

ఇక ఇంటర్వెల్ తరువాత అసలు కధ మొదలవుతుంది. ఒక బ‌ల‌మైన కార‌ణంతోనే పేట.. కాళీగా మార‌తాడని తెలుస్తుంది. కానీ, ద్వితీయార్ధం కూడా పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ స‌న్నివేశాల‌తో న‌డిపించాడు డైరెక్టర్. మొత్తంగా పేట పగ తీర్చుకునే సినిమా కధ అన్నమాట. తొలి స‌గంలో ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌, స్టైల్‌పై ఆధార‌ప‌డిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌, త‌ను తీర్చుకునే రివేంజ్ తో పనికానిచ్చేశాడు. ఐతే బ‌ల‌మైన ఫ్లాష్‌ బ్యాక్ ఉంటే ఇలాంటి క‌థ‌లు అదిరిపోతాయి. ఐతే ఈ సినిమాకు బలమైన ఫ్లాష్ బ్యాక్ లేకపోవడంతో అంతా తేలిపోయింది. ర‌జ‌నీకాంత్ ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కధలో ఫ్లాష్‌ బ్యాక్ ర‌క్తిక‌ట్టి ఉంటే, ఈ సినిమా మ‌రో విధంగా ఉండేది. పేటలో పాట‌లు కూడా తేలిపోయాయి.పాటల్లో ర‌జ‌నీకాంత్ స్టైల్‌ను చూసి మురిసిపోవ‌డం త‌ప్ప ఆ పాట‌ల వ‌ల్ల సినిమాకు వచ్చిన లాభం ఏంలేదనే చెప్పాలి.

అంతా ఇలా చేశారు…

సైత్ సూపర్ స్టాప్ ర‌జ‌నీకాంత్‌ కు ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌ అని చెప్పవచ్చు. ఐతే రజనీ స్టైల్ ను చూపించే ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఈ సినిమాలో లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. అక్కడక్కడా కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే హావ‌భావాలు కాస్త ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. రజనీకాంత్ ఈ వ‌య‌సులోనూ అంత జోరుగా న‌టించ‌డం కేవ‌లం ఆయన వ‌ల్లే అవుతుంది. ఇక ఇతర ముఖ్య పాత్రలు పోషించిన న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ‌సేతుప‌తి లాంటి వారు ఉన్నా.. వారికి తగ్గట్టుగా పాత్రలను తీర్చి దిద్దలేదనే చెప్పాలి. ఇక అందాల భామలు సిమ్ర‌న్‌, త్రిష‌ల‌తో ర‌జ‌నీకాంత్ న‌డిపిన ల‌వ్ ట్రాక్ సినిమాలో పరవాలేదనిపించింది. వీరిద్దరివి కూడా సినిమాలో ప్రాధాన్యం లేని పాత్రలేనని చెప్పాలి. మొత్తంగా రజనీకాంత్ స్థాయికి ఈ సినిమా చేసి ఉండాల్సింది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.