News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్ ..!

హైదరాబాద్ : తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ అంశాల‌వారిగా టార్గెట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత కొంత స్థ‌బ్ద‌త‌గా ఉన్న హ‌స్తం నేత‌లు .. ఇప్పుడు క్ర‌మంగా వాయిస్ పెంచుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌న్ని ఓవైపు ఎండ‌గ‌డుతూనే .. మ‌రో వైపు సాగునీటి ప్రాజెక్ట్ లు .. వైద్య రంగంలో జ‌రుగుతున్న నిర్ల‌క్ష్యం .. విద్యుత్ కొనుగోళ్ళు ఇలా ప్ర‌తి అంశంలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై గులాబీ బాస్ ను తూర్పార‌బ‌డుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. విద్యుత్ శాఖ‌ను కేసీఆర్ నీరుగారుస్తున్నార‌ని ఆరోపిస్తున్న కాంగ్రెస్ .. ఆ శాఖ‌లో అస‌మ‌ర్థ అధికారుల వైఫ‌ల్యాల‌తో ఉద్యోగులు మూల్యం చెల్లించాల్సిన ప‌రిస్థుతులు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు హ‌స్తం నేత‌లు. విద్యుత్ కొనుగోళ్ళ‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌భుత్వాన్ని స‌వాల్ చేస్తున్న ఆ పార్టీ నేత‌లు .. వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పాల‌న‌లో అన్ని రంగాలు అభివృద్దిలో వెనుక‌బ‌డ్డాయ‌ని ద్వ‌జ‌మెత్తున్న కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు .. అందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఇచ్చిన నివేదిక‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు.

Uttamkumar

ఇక రాష్ట్రంలో విజృంభిస్తున్న విష‌జ్వ‌రాల‌పై ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని మండిప‌డుతున్న హ‌స్తం నేత‌లు .. హాస్పిట‌ల్స్ విజిట్స్ తో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వాసుపత్రుల‌న్నింటికీ .. సుస్తీ చేసింద‌ని .. సిబ్బంది కొర‌త .. మందుల కొర‌త‌తో ఆసుప్తుల‌కు వెళ్ళే రోగులు న‌ర‌కం చూస్తున్నార‌ని చెబుతున్నారు. గ‌త కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్  ఏర్పాటు  చేస్తే .. ఇప్పటివరకు ఎక్విప్ మెంట్ కూడా సమకూర్చక పోవ‌డం ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ఇక హ‌ద‌రాబాద్ లోని ఫివ‌ర్ ఆసుప‌త్రి,ఉస్మానియా ఆసుప‌త్రుల‌ను విజిట్ చేసిన హ‌స్తం నేత‌లు .. అక్క‌డ రోగుల అవ‌స్థ‌ల‌పై అగ్గిమీద గుగ్గిల‌మౌతున్నారు.

Uttamkumar

- Advertisement -

ప్రాజెక్ట్ ల నిర్మాణాల‌పై వ‌స్తున్న‌ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ప్రాజెక్ట్ నిర్మాణాల్లో అవ‌త‌వ‌క‌ల‌ను ఓ వైపు ఎండ‌గ‌డుతూనే .. మ‌రో వైపు త‌మ ప్ర‌భుత్వం హ‌యాంలో నిర్మించ‌త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ ల సాధ‌న‌పై ఉద్య‌మాల‌ను ఉదృతం చేస్తున్నారు. తుమ్మిహెట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మాణం చేయాల‌ని తుమ్మ‌డిహెట్టి యాత్ర చేప‌ట్టిన హ‌స్తం ముఖ్య‌నేత‌లు .. ఇక రంగారెడ్డి జిల్లాలో ల‌క్ష్మిదేవిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణాన్ని కేసీఆర్ అట‌కెక్కించ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఒక్క‌డ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేయాల‌ని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చార‌ని నిల‌దీస్తున్నారు.

Uttamkumar

Tags: UTTAM KUMAR REDDY, CONGRESS,KCR,KTR,TRS, TELANGANA GOVERNMENT, TELANGANA PROJECTS, TELANGANA HOSPITALS,VIDHYUTH EMPLOYEES, REVANTH REDDY, BHATTI VIKRAMARKA,V HANMANTH RAO,ETELA RAJENDAR, HEALTH MINISTER, KALESHWARAM PROJECT, THUMMIDIHETTI PROJECT,CBI ENQUIRY, GANDHIBHAVAN,TRS BHAVAN,BJP

Leave A Reply

Your email address will not be published.