News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్ర‌తి ఆదివారం లాక్ డౌన్


క‌రోనా ఉధృతి కొన‌సాగుతుండ‌టంతో.. క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. ఇక‌నుండి.. బెంగళూరు సిటీలో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించిన సీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయాన్ని ప్ర‌క‌టించారు. ఆదివారాల్లో పూర్తిగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని తప్పనిసరి సర్వీసులు మాత్రమే నిర్వహించాలని అదికారుల‌ను ఆదేశించారు. ఇక సోమవారం నుంచి రాత్రి సమయాల్లో 8 దాటితే కర్ఫ్యూ విధించి ఉదయం 5గంటల వరకూ కొనసాగించనున్నట్లు వెల్లడించారు. సివిక్ ఏజెన్సీ బీబీఎంపీ హోల్ సేల్ వెజిటెబుల్ మార్కెట్స్ లలో క్రౌడ్ నుంచి తప్పించుకుంటే, గ్రోసరీ స్టోర్లలో దూరంగా ఉండగలిగితే కరోనా నుంచి బయటపడొచ్చు సూచించిన య‌డ్యూర‌ప్ప‌.. . కొవిడ్ 19పేషెంట్ల కోసం బెడ్ ల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొవిడ్ 19తో బాధపడుతూ మృతిచెందిన వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు. ఎనిమిది ప్రాంతాల్లోని జాయింట్ కమిషనర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బెంగళూరులోని కళ్యాణ మండపాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలు కొవిడ్ 19 కేర్ సెంటర్లుగా మర్చాలంటూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.