News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బోటు క్రింద మరో 13 మంది

ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రమాదానికి గురైన బోటు ఆచూకి లభించింది. పాపి కొండలు వెళ్లే దారిలో కచ్చులూరు మందంలోకి మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ దొరికింది. గోదావరిలో 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటు ఆచూకీ తెలుసుకున్నారు. సుధీర్ఘంగా శ్రమించిన ఉత్తరాఖండ్ విపత్తు దళం.. చివరికి ఆచూకీ కనుగొన్నది.  దీంతో ఈ బోటును బయటకు తీసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బొటును వెలికి తీసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు తీవ్ర స్తాయిలో నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

kachuluru boat accident

- Advertisement -

ఐతే గోధావరి వరద నీరు, అక్కడ ప్రమాదకరమైన సుడిగుండాల కారణంగా బోటును బయటికి తీయడానికి అడ్డంకిగా మారాయి. ముంబయ్ మెరైన్ నిపుణుడు సౌరవ్ భక్షి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, మత్స్యకార బృందం ఆధ్వర్యంలో బోటను వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకూ మొత్తం 34 మృతదేహాలను వెలికి తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక నీటి లోపల ఉన్న బోటు బయటకు తీస్తే మిగిలిన 13 మృతదేహాలు దొరుకుతాయని భావిస్తున్నారు.

Tags: kachuluru boat accident, godavari kachuluru boat accident, east godavari boat accident, kachuluru boat accindet updates

Leave A Reply

Your email address will not be published.