News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వేళాయే..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖ‌రారైంది. ఫిభ్రవరి 22 నుంచి 25 వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు జ‌ర‌గ‌నున్న ఈ సమావేశాలలు జ‌రుగుతాయి. ఈనెల 22వ తేదీ ఉదయం 11.30 గంటలకు సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 23 వ తేదీన బడ్జెట్ పై చర్చ జరుగనుంది. 25 వ తేదీన బ‌డ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలుపనుంది. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ఎవరు ప్రవేశపెడుతారన్న అంశం మాత్రం ఇప్ప‌డికి ఉత్కంఠత రేపుతుంది. ఇప్ప‌డి వ‌ర‌కు సీఎం కేసీఆర్ తో పాటు.. మ‌మ‌మూద్ ఆలీ హోంమంత్రిగా కొన‌సాగుతున్నారు. ఈ ప‌రిస్తితుల్లో బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతారా…? లేదా ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారా..? అన్న అంశం సందిగ్తంగా  ఉంది. ఒక‌వేళ  ఆర్థిక‌ మంత్రి ప్ర‌వేశ‌పెట్టేట్లు అయితే.. క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంటుంది.  మ‌రి అప్ప‌టి లోక క్యాబినెట్ విస్థ‌ర‌న జ‌ర‌గుతుందా అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.