News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

భ‌రోసా యాత్ర‌కు ప్రియాంకా గాంధీ ..!

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని ఏపీ కాంగ్రెస్ మ‌రోసారి పున‌రుద్ఘాటించింది. కేంద్రంలో రాహుల్ ప్ర‌ధాని కాగానే ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చి తీరుతార‌ని చెబుతున్నారు ఆ పార్టీ నాయ‌కులు. దీనిపై ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్గించేందుకు తలపెట్టిన భరోసా యాత్ర మంగళవారం ప్రారంభమైంది. జిల్లాలోని మడకశిరలోని నీలకంఠాపురంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, డీకే శివకుమార్‌, ఊమన్‌ చాందీ ఈ బస్సు యాత్రను ప్రారంభించారు.

AP CONGRESS

- Advertisement -

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. మార్చి 3వ తేదీ వరకు 2251 కిలోమీటర్లు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేతలు, జాతీయ స్థాయి నాయకులు, స్టార్ క్యాంపెయినర్ లు పాల్గొంటారు. ఈనెల 22న తిరుపతిలో జరిగే యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అలాగే 27వ తేదీ యాత్రలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొంటారని రఘువీరా చెప్పారు.

AP CONGRESS

Leave A Reply

Your email address will not be published.