News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మంత్రి పదవికి దూరం ఉంటే బాగుండేదంటున్న అభిమానులు

హైదరాబాద్ : మొత్తానికి మామా, అల్లుళ్ళ డ్రామాకు తెరపడింది. ఇన్నాళ్లు తనను మామా దూరం పెట్టినట్టు, అల్లుడంటే తనకు పడదన్నట్లు కేసీఆర్ మొహం తిప్పుకుని తిరగడం చూశాం.. హరీషుకు మంత్రి పదవి ఇవ్వడంతో ఇక ఈ సీన్ కు తెరపడిందనే చెప్పాలి. మంత్రి పదవి అనగానే లొట్టలేసుకుని కేసీఆర్ దగ్గరకు వెళ్లిన హరీష్ రావు పై ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

కొన్ని రోజుల నుంచి హరీష్ రావు, కేసిఆర్ మధ్య దూరం పెరిగినట్లు కనిపించింది. ఇక హరీష్ రావు తాడోపేడో తేల్చుకుంటాడని ప్రచారం జరిగింది. అవసరమైతే కొత్త పార్టీ, లేకుంటే బీజేపీ లోకి వెళ్లి తడాఖా చూపిస్తారని ప్రచారం జరిగింది. ఆయన అభిమానులైతే హరీష్ కు అన్యాయం జరిగిందని.. హరీష్ రావు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ను ఆడిపోసుకున్నారు. ఇక ఇంత అవమానం తర్వాత కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చినా తీసుకోవద్దని డిమాండ్ కూడా చేశారు.

Telangaana ministers with governor thamilshai

- Advertisement -

మామా కేసీఆర్ నుంచి ఎప్పుడు పిలుపొస్తదా అని ఎదురుచూసిన హరీష్ రావు కు క్యాబినెట్ లో చోటు దక్కగానే  వెళ్లటం అభిమానులకు రుచించలేదు.అయితే హరీష్ రావు మంత్రి పదవి రిజెక్ట్ చేస్తే వ్యవహారం  వేరేేేలా ఉండేదని. అనుకుుంటున్నరు. ఈ దెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా హరీశ్ కున్న అభిమానులు మనసు మార్చుకుంటున్నారట.

Harish rao oath time for minister

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే హరీష్ రావు కు మంత్రి పదవి ఇచ్చారని టిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. అవకాశవాదం కోసం కేసీఆర్ .. తనను మంత్రి చేస్తే.. హరీష్ పావులా మారాడని ఆయన అభిమానులు గునుక్కుంటున్నారు. ఇక హరీష్ రాజకీయం కూడా ముగిసినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు

Leave A Reply

Your email address will not be published.