News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మోదీకి రోజులు దగ్గరపడ్డాయి

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన సేవ్ డెమోక్రసి నిరసన సక్సెస్ అయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తమైందని ఈ సందర్బంగా చంద్రబాబు విమర్శించారు. మోదీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు.. పలు సందర్బాల్లో ఆందోళనకు దిగారని ఆయన గుర్తు చేశారు. 1972 తర్వాత దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని.. యువత అంతా నిరాశ నిస్పృహలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ప్రధానికి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవని మంచిపడ్డ ఆయన.. దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని మోదీని ప్రశ్నించారు.

babu

- Advertisement -

తామంతా ఎక్కడ చదువుకున్నామో చెప్పగలమన్న చంద్రబాబు.. మరి ప్రధాని మోదీ  ఎక్కడ చదువుకున్నారో చెప్పగలరా అని నిలదీశారు. రఫేల్‌‌ యుధ్ద విమానాల ఒప్పందంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని..  ప్రధాని మోదీ ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. దేశంలో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేశారని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తన పరిపాలనలో దేశ రాజధానిలో అద్భుతాలు చేశారని పొగిడిన చంద్రబాబు.. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.