News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మ‌ధుసూధ‌నాచారి అరెస్ట్ త‌ప్ప‌దా..?

హైద‌రాబాద్- తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారిని అరెస్ట్ చేయ‌బొతున్నారా..? ఆయ‌న స్పీక‌ర్ గా ఉన్న‌స‌మ‌యంలో అప్ప‌డి ఎమ్మెల్యేలు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, సంప‌త్ కుమార్ ల అన‌ర్హ‌త ప‌టిష‌న్ విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హరించిన తీరే ఇప్పుడు ఆయ‌న అరెస్ట్ కార‌ణ‌మైతుందా..? అంటే తాజాగా హైకోర్ట్ స్పందించిన తీరు చూస్తే త‌ప్ప‌ద‌నిపిస్తుంది. అవును.. మాజీ స్పీక‌ర్ మ‌ధుసూదాచారిపై హైకోర్టు గ‌తంలో ఏ స్పీక‌ర్ ప‌ట్ల లేని విధంగా సీరియస్ కావ‌డం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతుంది. మధుసూద‌నాచారి  స్పీక‌ర్ గా ఉన్న‌గ‌త స‌మావేశాల‌లో .. బహిష్కరణకు గురైన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వాల‌ను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోర్ట్ ఉత్త‌ర్వుల‌ను స్పీక‌ర్ అమ‌లు చేయ‌కుండా కోర్టు ధిక్కారకు పాల్ప‌డ్డార‌ని హైకోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈకేసులో మ‌ధుసూద‌నాచారిని ప్ర‌తివాదిగా చేర్చుతూ నోటీస్ లు జారిచేసింది. అంతేకాదు మార్చి 8 న జ‌రిగే.. త‌దుప‌రి విచార‌ణ‌కు మాజీ స్పీక‌ర్ హ‌జ‌రుకావ‌ల్సందే అని ఆర్డ‌ర్ వేసిన న్యాయ‌స్థానం.. లేని ప‌క్షంలో త‌మ ప‌ని తాము చేసుకు పోతామ‌ని వార్నింగ్ ఇచ్చింది. అంటే ఒక‌వేల మ‌ధుసూధ‌నాచారి కోర్ట్ విచార‌ణ‌కు హ‌జ‌రుకాక‌పోతే..ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. దీనికి గ‌తంలో సుప్రిం కోర్ట్ తీర్పుల‌ను ప్ర‌స్తావించింది కోర్ట్. గ‌తంలో మణిపూర్‌ స్పీకర్‌ అరెస్టు, ..  మనిలాల్‌ సింగ్‌ వర్సెస్‌ డాక్టర్‌ హెచ్‌.బోరోబాబూసింగ్‌ కేసు, సీకే దెఫ్తారి వర్సెస్‌ ఒపీ  గుప్త కేసులను ప్ర‌స్తావించిన  హైకోర్ట్.. ఒక‌వేల రాష్ట్ర పోలీసులు స‌హ‌క‌రించ‌క‌పోతే… కేంద్ర బలగాల సాయంతో  అరెస్ట్‌ చేయించడానికీ  వెనుకాడబోమని న్యాయమూర్తి హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

/hycourt_on_komatireddy_sampath_case.

- Advertisement -

ఇప్ప‌డికే ఈకేసులో అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర‌సింహ్మ‌చార్యులు, హోం శాఖ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ రావుల‌ను  న్యాయ‌స్తానం అదుపులోకి తీసుకుని 10 వేల రూపాయ‌ల పూచిక‌త్తుతో విడుద‌ల చేసింది. అంతేకాదు.. అప్పుడు కోర్టు నోటీసులు అందుకున్న‌ డీజీపీ, నల్లగొండ,  జోగుళాంబ గద్వాల జిల్లాల ఎస్పీలు స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఆగ్ర‌మం వ్య‌క్తం చేసిన హైకోర్ట్ వారు కూడా తదుపరి విచారణకు వారు హాజరుకావ‌ల్సిందే అని స్పష్టం  చేసింది. దీంతో మాజీ స్పీక‌ర్  కోర్ట్ కు హ‌జ‌రుకాక‌పోతే.. అరెస్ట్ చేయ‌డం ఖాయ‌మ‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.