News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

రాఫెల్ యుద్ద‌విమానాలు వ‌చ్చేశాయి..


భార‌త అమ్ముల పొదిలోకి రాఫెల్ చేరిపోయింది. అత్యంత అధునాత టెక్నాల‌జీతో రూపొందించిన రాఫెల్ యుద్ద‌విమానాలు ఇండియ‌న్ ఆర్మీలో చేరిపోయాయి. హ‌ర్యాణ‌లోని అంబాల విమానాశ్ర‌యానికి చేరిన ఈ జెట్ ఫైటర్స్ కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో భార‌త్ రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తొలి విడ‌తతో.. అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను భార‌త్ కు అందించింది ఫ్రాన్స్..

భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు మొత్తం 59వేల కోట్లతో 36 రాఫెల్ విమానాలు అందించేలా ఫ్రాన్స్ తో భారతదేశం 2016 సెప్టెంబర్ 23న ఒప్పందం చేసుకుంది. ఈ యుద్ద విమానాల‌ను దసాల్ట్‌ సంస్థ తయారు చేసింది. ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భారతదేశ వాయుసేన మరింత శక్తివంతం కావడం ఖాయం.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.