News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

లవర్స్ డే సినిమా రివ్యూ

సినిమా- లవర్స్‌ డే

తారాగణం- ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా త‌దిత‌రులు

సంగీతం- షాన్ రెహ‌మాన్‌

నిర్మాత‌లు- సి.హెచ్‌. వినోద్‌రెడ్డి, ఎ. గురురాజ్‌.

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం- ఒమ‌ర్ లులు

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం…………..

ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుంది కదా.. ముద్దుల‌తో గ‌న్ను పేల్చి ప్ర‌పంచం మొత్తాన్ని త‌న‌వైపు తిప్పుకుంది ప్రియా. మ‌ల‌యాళంలో నిర్మించిన ఒరు ఆడార్‌ ల‌వ్‌ సినిమాలోని ఆ స‌న్నివేశం వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సీన్ తో ప్రియా ప్రకాష్ వారియర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెలబ్రెటీ అయిపోయింది. అంత వరకు ఆ సినిమాలో చిన్న పాత్ర పోషించిన  ప్రియా ప్ర‌కాష్.. ఒక్కసారిగా ఫేమ‌స్ అయిపోయింది. ఈ నేపధ్యంలో సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ పాత్ర నిడివి కూడా పెరిగి పోయింది. ఒరు అడార్ ల‌వ్ సినిమా పలు దక్షిణాది భాష‌ల్లోను అనువాద‌మైంది. తెలుగులో ల‌వ‌ర్స్ డే గా వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విజుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

లవర్స్ డే సినిమా కధ……….

- Advertisement -

- Advertisement -

ఇక కధలోకి వెళ్తే.. ఇంట‌ర్‌ కళాశాల నేప‌థ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. రోష‌న్ (రోష‌న్‌), ప్రియా (ప్రియా వారియ‌ర్‌), ప‌వ‌న్ (వైశాఖ్ ప‌వ‌న‌న్), గాథ జాన్ (నూరిన్ షెరిఫ్‌), మాథ్యూ (మాథ్యూ జోసెఫ్‌)… ఈ ఐదు మంది క్లోజ్ ఫ్రెండ్స్. అంతా ఒకే క్లాస్ చ‌దువుతుంటారు. ఇంకేముంది వీళ్ల‌లో రోష‌న్‌, ప్రియా తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. వీళ్లిద్దరూ ఒక్క‌టి కావ‌డానికి గాథ హెల్ప్ చేస్తుంది. అనుకోకుండా కాలేజ్‌ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన కొన్ని వీడియోల వ‌ల్ల రోష‌న్‌కు, ప్రియాకు మ‌ధ్య గ్యాప్ వస్తుంది. మనస్పర్ధల కారణంగా ప్రియా, రోషన్ కు బ్రేక‌ప్ చెబుతుంది. దీంతో విడిపోయిన ప్రేమికుల్ని మ‌ళ్లీ కలపాలని నిర్ణయించుకుంటారు. ఇందులో భాగంగానే  ప్రియాలో ఈర్ష్య క‌లిగించాల‌ని స్నేహితులంతా క‌లిసి గాథ, రోష‌న్‌లు ప్రేమిుంచుకుంటున్నట్లు న‌టించాల‌ని ప్లాన్ చేస్తారు. ఐతే కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరు నిజంగానే ప్రేమలో పడతారు. మరి వాళ్ల ప్రమ ఎక్కడిదాకా వెళ్లింది.. సక్సెస్ అయ్యిందా లేదా.. చివరకు కధ ఏ మలుపు తిరిగింది అన్నదే అసలైన కధ.

lovers day

సినిమా ఎలా ఉందో తెలుసా…………

లవర్స్ డే సినిమా సహజంగానే ప్రేమకుల కధ. ప్రేమ కధా చిత్రాలు ప్రేక్షకులకు కొత్తేం కాదు. ఇక ఈ సినిమాలో ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం, ఇష్ట‌ప‌డ‌టం, కాలేజీలో జ‌రిగే ఫ్రెష‌ర్స్ డే, యానువ‌ల్ డే సంద‌డితో ఇంటర్వెల్ అవుతుంది. ఇక ఇంటర్వెల్ తరువాత విడిపోవడం, మ‌ళ్లీ కొత్త‌గా వేరొకరితో ప్రేమ‌లో ప‌డ‌టం వంటి ఆసక్తికరమైన అంశాలతో కధ సాగుతుంది. క్లైమాక్స్ మిన‌హా ఈ సినిమాలో కొత్తదనం ఏంలేదనే చెప్పాలి. క్లైమాక్స్ సైతం పెద్దగా ఆసక్తికరంగా ఏం లేదని చెప్పవచ్చు. ఈ సినిమా హీరోయిన్ ప్రియా వారియ‌ర్ క‌న్నుకొట్టే స‌న్నివేశం వైరల్ గా మారిన త‌ర్వాత ఈ సినిమా అసలు కధలో చాలా మార్పులు చేశారట. ప్రియా వారియర్ కు ద‌క్కిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఆమె పాత్ర ప‌రిధిని బాగా పెంచేశారట. దీంతో అసలు క‌థ‌లో ఫ్రేవర్ మిస్ అయ్యింది. సహజంగానే ప్రేమ‌క‌థ‌ల‌కి భావోద్వేగాలు చాలా ముఖ్యం. కానీ లవర్స్ డే సినిమాలో మాత్రం భావోద్వేగాలను పండించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అసలు క‌థ ఏం చెప్ప‌కుండా ప్ర‌థ‌మార్ధంలో ప్రియా, రోష‌న్‌ల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల్ని చాలా సేపు సాగాదీశాడు. ఇంటర్వెల్ తరువాత కూడా సినిమాలో చెప్పుకోద‌గ్గ క‌థేం లేదని చెప్పవచ్చు. రోష‌న్‌, గాథ‌ల మ‌ధ్య ప్రేమ పుట్టే స‌న్నివేశాలు కొంత వరకు ఆకట్టుకుంటాయి. స్టూడెంట్స్, లెక్చరర్ల మ‌ధ్య స‌న్నివేశాలు కొంత మేర నవ్విస్తాయి.

ఎవరెలా చేశారంటే……………..

ఈ సినిమాలో ప్రియా, నూరిన్, షెరిఫ్, రోష‌న్‌ పాత్రలే కీల‌కం. ప్రియా ప్రకాష్ వారియర్ క‌న్నుకొట్టే స‌న్నివేశంతో పాపుల‌ర్ అవ‌డంతో ఆమె సినిమాకి స్పెషల్ గా మారింది. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ నూరిన్ షెరిఫ్ కూడా సినిమాలో త‌న అందంతో ఆక‌ట్టుకుంది. ప్రియా వారియర్ తో సమానంగా పోటీ పడింది. కొన్ని సన్నివేశాల్లో నూరిన్ పాత్రే ముఖ్యమైందిగా అనిపిస్తుంది. యాక్టింద్ ప‌రంగా కూడా ఆమె బాగా ఆకట్టుకుంది. రోష‌న్ న‌ట‌న‌ పేలవంగానే అనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపించింది. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం కూడా పరవాలేదు. ఇక డబ్బింగ్ మాత్రం  సినిమాకి అస్సలు సూట్ అవ్వలేదు. మొత్తానికి రోటీన్ ప్రేమ కధా చిత్రమే తప్పితే.. సినిమాలో ప్రత్యేకత ఏం లేదు.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

నోట్- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Leave A Reply

Your email address will not be published.