News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

లోక్ సభ ఎన్నికలు ఇవియం లతో కాదు.. బ్యాలెట్ తో

హైద‌రాబాద్ – అసెంబ్లీ ఎన్నిక‌లలో ఈవిఎంల‌లో అక్ర‌మాలు జ‌రిగాయి.., వ‌చ్చే ఎన్నిక‌ల‌ను బ్యాల‌ట్ తోనే జ‌ర‌పాలని ముక్త‌కంఠంతో డిమాండ్ చేశారు ప్ర‌జా కూట‌మి నేత‌లు. కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ వైఫల్యాల‌కు నిర‌స‌న‌గా ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ లో ..ధ‌ర్నాలో పాల్గొన్న నేత‌లు.. ప‌దివేల‌లోపు మెజారిటి వ‌చ్చిన చోట్ల వీవీ ప్యాట్ ల‌ను లెక్కించాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత డీలాప‌డి తేరుకున్న‌ కాంగ్రెస్ పార్టీ.. స్వ‌రంపెంచింది. ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డి గెలిచింద‌ని.. ఆరోపిస్తున్న వ‌స్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నిక‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ వైల్యాల‌పై నిర‌స‌న కు దిగింది. ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ లో కాంగ్రెస్ చేప‌ట్టిన ధ‌ర్నాలో ప్ర‌జా కూటమి నేత‌లు అంద‌రు పాల్గొన్నారు. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎల్ ర‌మ‌ణ‌,రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కోదండ‌రాం, చాడా వెంక‌ట్ రెడ్డి,మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, డికేఅరుణ‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

No evm only ballet

పోలింగ్ .. ఓట్ల లెక్కింపు నాటికి పోలింగ్ శాతంలో తేడాను ఎన్నిక‌ల‌ క‌మీష‌న్ కు ఆదారాల‌తో వివ‌రించినా.. ఈసీ ర‌జ‌త్ కుమార్ ప‌ట్టించుకోలేద‌ని పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అభ్య‌ర్థుల‌కు అనుమాలున్న చోట‌.. ఎందుకు వీవీప్యాడ్ ల‌ను లెక్కించ‌డంలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కోదాడ‌, ధ‌ర్మ‌పురి, తుంగ‌తుర్తి, ఇబ్ర‌హింప‌ట్నం ఇలా.. ప‌దివేల లోపు మెజారిటి వ‌చ్చిన చోట వీవీ ప్యాట్ ల‌ను లెక్కించాలని డిమాండ్ చేశారు. రాజ‌స్తాన్ ,ఛ‌త్తీస్ గ‌డ్ ల‌లో వీవీ ప్యాట్ ల‌ను లెక్కించార‌ని తెలంగాణ‌లో మాత్రం దీనికి భిన్నంగా ఈసీ వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపించారు .ఎన్నిక‌ల‌ను ఫ్రీ అండ్ ఫేర్ గా జ‌ర‌ప‌డ‌టంలో ఎన్నిక‌ల క‌మీష‌న్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డ ఉత్త‌మ్..వ‌చ్చే ఎన్నిక‌లను బ్యాల‌ట్ తో నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -

No evm only ballet

 

టిఆర్ఎస్ చేతిలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ కీలుబోమ్మ‌గా ప‌నిచేసింద‌ని ఆరోపించారు టిడిపి అధ్యక్షులు ఎల్ ర‌మ‌ణ‌. ఓట్లు గ‌ల్లంతుపై ఆదారాల‌ను అందించినా.. ఈసీ ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డ ర‌మ‌ణ‌.. ట్యాంప‌రింగ్, ట్యాపింగ్, ట్రాపింగ్ ల‌తో టిఆర్ఎస్ గెలిచింద‌ని అన్నారు. గ‌ల్లంతైన ఓట్ల‌ స‌వ‌రించ‌కుండా..ర‌జ‌త్ కుమార్ .. క్ష‌మాప‌ణ‌ల‌తో చేతులు దులుపుకున్నార‌ని విమ‌ర్శించిన జ‌న‌స‌మితి అధ్యక్షులు కోదండ‌రాం… వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్యాల‌ట్ తోనే ఎన్నిక‌ల‌ను జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

ర‌జ‌త్ కుమార్ తీరుతో .. ప్ర‌జల‌కు ప్ర‌జా స్వామ్యంపై న‌మ్మ‌కం పోతుంద‌ని అన్నారు సీపీఐ కార్య‌ద‌ర్శి చాడా. 31 నియోజకవర్గా లలో పోలైన ఓట్ల కు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా ఉన్నా ..కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృస్ట‌క‌రం అన్నారు. ఈవిఎం ల మీద నమ్మకంలేక‌నే తీసుకువ‌చ్చిన వీవీ ప్యాట్ ల‌ ను ఎందుకు లెక్కించ‌ర‌ని ప్ర‌శ్నించిన చాడా.. ఈవిఎం ల ట్యాoపరింగ్ పై దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు. మ‌రోవైపు.. ఈవిఎం ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని హై కోర్ట్ లో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేత‌లు రేవంత్, డికెఅరుణ‌, దాసోజు శ్ర‌వ‌ణ్ లు. టిఆర్ఎస్ అభ్య‌ర్తులు,, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. , ఓట్ల కౌంటింగ్ లో అవకతవకలకు పాల్పడి గెలిచచార‌ని .. వారిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్ట్ ను ఆశ్రయించారు. మొత్తానికి ఓట‌మితో డిలాప‌డ్డా.. కాస్త ఆల‌శ్యంగా మేల్కొన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఈవిఎం ల పై పోరాటాన్ని ఉధృతం చేసింది.

Leave A Reply

Your email address will not be published.