News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుస్తాం

హైదరాబాద్ : పార్లమెంట్ సభ్యులను రాహుల్ గాంధీ నే ఎంపిక చేస్తారనీ అన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందనీ అన్నారు. పార్లమెంట్ సభ్యులు ఎంపికలో పార్టీ జిల్లా అధ్యక్షులు నిర్ణయం ప్రధాన పాత్ర పోషిస్తుందనీ చెప్పారు. రాహుల్,ప్రియాంక లను పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. 25 వ తేదీ లోపు అభ్యర్థుల లిస్ట్ ను రాహుల్ గాంధీకి పంపిస్తామని తెలిపిన ఉత్తమ్.. ఈనెల చివరకు ఎంపీ అబ్యర్థుల ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. శాసన మండలి,పట్టభద్రుల mlc లకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.