News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వాట్స్ యాప్ పేరు మారింది ..!

హైదరాబాద్ : వాట్సప్ పేరు వినకుండా .. వాట్సప్ చూడకుండా క్షణం కూడా నేటితరానికి గడవడం లేదు. నేటి తరంతో ఇంతటి బంధం పెనవేసుకున్న ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కు చెందిన వాట్సాప్‌ పేరు ఇప్పుడు మారిపోతోంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌ గానే పరిగణిస్తున్న ఈ యాప్‌ ఇకపై వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఇది దర్శనమిస్తుండగా.. త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. పేరులో మార్పు తప్ప.. యాప్‌ లో మరే ఇతర మార్పూలు ఇప్పట్లో కనిపించకపోవచ్చు. 2012లో ఇన్‌స్టాను .. 2014లో వాట్సాప్‌ ను ఫేస్‌బుక్‌ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ అవి ఆయా పేర్లతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి.

WHatsaap

- Advertisement -

ఇటీవలే పేరు మార్చాలని ఫేస్‌బుక్‌ యాజమాన్యం నిర్ణయించడంతో అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ బై ఫేస్‌బుక్‌ .. వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని మారుస్తున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగానే వాట్సాప్‌ లో తాజా మార్పు చోటుచేసుకుంది. బీటా యూజర్లు వాట్సాప్‌ లోని సెట్టింగ్స్‌లోకి వెళితే .. వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని కనిపిస్తుంది. భవిష్యత్‌ లో కీలక మార్పులకు ఫేస్‌బుక్‌ ఈ విధంగా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఉపయోగించే వ్యక్తి .. వాట్సాప్‌ ఖాతా మాత్రమే కలిగిన వ్యక్తితోనూ నేరుగా చాట్‌ చేసే అవకాశం ఉంది. 2020 నాటికి ఇంటిగ్రేషన్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వాట్సాప్‌ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ సదుపాయం వాట్సాప్‌ తీసుకొచ్చింది.

WHatsaap

Leave A Reply

Your email address will not be published.