News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

విజయవాడ సమీపంలో తలదాచుకున్న టీవీ9 రవిప్రకాశ్

  • విచారణకు పది రోజుల సమయం కోరుతూ లేఖ
  • రవిప్రకాశ్, శివాజీల నుంచి మెయిల్స్
  • ఐపీ అడ్రస్ లను విశ్లేషించిన పోలీసులు

సంతకాల ఫోర్జరీ, వాటాదారులను మోసం చేయడం, డేటా చౌర్యం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, ఆయనకు సహకరించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న నటుడు శివాజీలు విజయవాడ సమీపంలోనే ఉన్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

- Advertisement -

తాము విచారణకు రావడానికి మరో 10 రోజుల సమయం కావాలని వీరిద్దరి నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ ను విశ్లేషించిన పోలీసులు, ఐపీ అడ్రస్ లు విజయవాడ నుంచే వచ్చాయని గుర్తించినట్టు తెలిసింది. దీంతో వారి కోసం విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి, అక్కడికి ఓ బృందాన్ని పంపినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

Leave A Reply

Your email address will not be published.