News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

విశాఖలో భాలీ వెసల్

హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ విశాఖపట్నంలోని రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన భారీ వెసల్‌ను దిగుమతి చేసుకుంది. ఆదివారం ఉదయం విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డు జెట్టీ నుంచి ఈ భారీ వెసల్‌ను పరిశ్రమ వద్దకు తరలించారు. పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ భారీ మెషినరీని విజయవంతంగా తీసుకెళ్లారు. మొత్తం 48 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ భారీ వెసల్‌ను తరలించేందుకు ఏకంగా 520 చక్రాలు ఉన్నఅతి పెద్ద వాహనాన్ని ఉపయోగించారు. తెల్లవారు ఝామున ఐదు గంటల నుంచే భారీ వెసల్‌ను తరలింపు ప్రక్రియను చేపట్టారు. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు గేటు నుంచి సింధియా సర్కిల్, ఈఎస్‌ఐ హా్స్పిటల్, నౌసేనాబాగ్‌ మీదుగా మల్కాపురం సినిమా ధియేటర్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ టెర్మినల్‌లోకి తరలించారు. ఈ భారీ వెసల్‌ను గుజరాత్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చారు. ఇక ఈ భారీ వాహనాన్ని, వెసెల్ ను విశాఖ జనం ఆసక్తిగా తిలకించారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.