News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వీర జ‌వాన్ కు కాంగ్రెస్ గ్రేట్ సెల్యూట్..


భారత్- చైనా బార్డ‌ర్ లో అసులు బాసిన వీర జ‌వాన్ క‌ల్న‌ల్ సంతోష్ బాబుకు కాంగ్రెస్ పార్టీ ఘ‌నంగా సంతాపం తెలిపింది. సంతోష్ త్యాగాన్ని గుర్తు చేస్తు.. గ‌ల్లీ నుండి డిల్లీ వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌లు శ్రేణులు సంతోష్ బాబు కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతిని తెలిపారు. పీసీసీ ఛీప్ , న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తి రెడ్డి సూర్యాపేటలోని సంతోష్ బాబు నివాసానికి వెళ్ళి ..సంతోష్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. సంతోష్ త‌ల్లి దండ్రుల‌కు ఉత్త‌మ్ దంప‌తులు ధైర్ఘ్యాన్ని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ ను చూసి నేడు దేశం గ‌ర్విస్తుంద‌న్న ఉత్త‌మ్.. సంతోష్ గొప్ప దేశ భ‌క్తుడ‌ని అన్నారు. భ‌విష్య‌త్ లో సంతోష్ కుటుంబానికి అండ‌గా ఉంటామని తెలిపారు ఉత్త‌మ్ .

సంతోష్ మ‌ర‌ణం ప‌ట్ల ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంది, ఎంపీ రాహుల్ గాందీలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేశారు. సంతోష్ బాబు స‌తీమ‌ణి సంతోషికి .. సోనియా, రాహుల్ లు వేరు వేరుగా ప్ర‌త్యేకంగా పంపిన లేఖ‌ల‌ను పీసీసీ ఛీప్ ఉత్త‌మ్., సంతోష్ బాబు తల్లి దండ్రుల‌కు అంద‌చేశారు. మాతృభూమి రక్షణ కోసం కల్నల్ సంతోష్ బాబు ప్రాణ త్యాగం చేయడం నా హృదయం ద్రవింప ‌చేసింద‌న్న సోనియాగాంది.. సంతోష్ అమరత్వం, త్యాగం, దేశ భక్తి, ధైర్యం ఎల్లప్పుడూ చిరస్మరణీయని.. . కల్నల్ సంతోష్ బాబు ను ఈ దేశం ఎల్లపుడు గౌరవిస్తుందిన లేఖ‌లో పేర్కొన్నారు. భరత మాత ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కు భారమైన హృదయంతో నివాళులు అర్పిస్తున్నాన్నారు సోనియా.

కల్నల్ సంతోష్ బాబు వీర మరణం ప‌ట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన రాహుల్ గాంది.. దేశంలో ప్రతి పౌరుడు శాంతి, స్వతంత్రంగా జీవించేందుకు కల్నల్ సంతోష్ బాబు చేసిన‌ త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు రాహుల్. ఒక దేశ భక్తుడిని ఈ జాతి కోల్పోయిందని, ఈలాంటి విపత్కర పరిస్థితులలో సంతోషబాబు కుటుంబానిక్ జాతి యావత్తు అండగా ఉంటుందని లేఖ‌లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ

ఇక సంతోష్ బాబు పార్థీవ దేహాన్ని ద‌ర్శించుకుని నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్ర‌త్యేక వి‌మానంలో హ‌కీంపేట్ ఏయిర్ పోర్ట్ కు వ‌చ్చిన సంతోష్ బాబు పార్థీవ దేహానికి ఘ‌ణంగా నివాళులు అర్పించిన రేవంత్.. క‌ల్న‌ల్ సంతోష్ త్యాగం వెల‌క‌ట్ట‌లేనిద‌ని..అన్నారు. సంతోష్ వీర మ‌ర‌ణం ప‌ట్ల కాంగ్రేస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఆర్ సీ కుంతీయా త‌న ప్ర‌గాడ సంతాపాన్ని తెలియ‌జేశారు.ఇక రాష్ట్ర‌ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్బ్రాంతీని వ్య‌క్తం చేస్తు.. చైనా దురాగ‌తానికి గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌ని డిమాండ్ చేశాయి.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.