News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సర్కార్ దవాఖానాలపై కాంగ్రెస్ ఆవేదన ..!

హైద‌రాబాద్ : రాష్ట్రంలో విష‌జ్వారాల విజృంభ‌న‌పై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. రాష్ట్రమంతా విష‌జ్వ‌రాల‌తో మ‌గ్గుతుంటే .. ప్ర‌భుత్వానిక చీమ‌కుట్టిన‌ట్లైనా లేదా అంటూ గులాబీ స‌ర్కారును నిల‌దీస్తున్నారు ఆ పార్టీ నేత‌లు. రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్కారు ద‌వాఖానాల‌న్నీ రోగుల‌తో కిక్కిరిసి పోయాయ‌ని .. అయితే చికిత్స కోసం వ‌చ్చిన రోగుల‌కు చికిత్స‌నందించేందుకు హ‌స్పిట‌ల్స్ లో అర‌కొర సిబ్బంది .. చాలిచాల‌ని మందులు ..స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వాసుప‌త్రుల‌ను విజిట్ చేస్తున్న హ‌స్తం నేత‌ల బృందం .. ఎప్ప‌టిక‌ప్పుడు హ‌స్పిట‌ల్స్ దుస్థితిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆసుప‌త్రులకు విష‌జ్వారాల‌తో చికిత్స కోసం వ‌చ్చే రోగుల‌కు స‌రిప‌డా బెడ్స్ లేక .. ఒక్క బెడ్ పై ఇద్ద‌రు ముగ్గురు ఆడ .. మ‌గా పేషెంట్స్ ను ప‌డుకోబెడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఏ ఒక్క హ‌స్పిటల్ లో ప‌రికారాలు స‌రిగ్గా ప‌నిచేయ‌ని దుస్థితి ఉంద‌ని చెబుతున్నారు. కానీ స‌ర్కారు పెద్ద‌లు మాత్రం పార్టీ ఓన‌ర్ షిప్ లోల్లిలో ప‌డి ప్ర‌జారోగ్యాన్ని గాలికొదిలేశార‌ని ఫైర్ అవుతున్నారు.

Uttamkumar

రాష్ట్రంలో వైద్య రంగ‌మే కాదు .. వ్య‌వ‌సాయ రంగం కూడా కుంటుప‌డింద‌ని హ‌స్తం నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. రైతుబంధు డ‌బ్బులు అంద‌క .. పెట్టుబ‌డుల‌కు రైత‌లు ప్ర‌వేటు వ్యాపారుల వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌రో వైపు యూరియా అందుబాటులో లేక .. రైతాంగం నానాతంటాలు ప‌డుతున్నారంటున్న కాంగ్రెస్ .. ప్ర‌భుత్వం దీనిపై త‌క్ష‌ణం స్పందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇక రుణ‌మాఫీపై ఎన‌నిక‌ల్లో ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న హ‌స్తం పార్టీ .. నెల‌లు గ‌డుస్తున్నా .. కేసీఆర్ దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో రైత‌లు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని చెబుతున్నారు. సర్కారు పెద్ద‌లు ఇప్ప‌టికైనా .. త‌మ పార్టీ ఓన‌ర్ షిప్ లొల్లిని కొద్దిగా ప‌క్క‌న పెట్టి .. ప్ర‌జారోగ్యం .. రైతాంగ స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించాల‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు హ‌స్తం నేత‌లు.

- Advertisement -

Uttamkumar

Tags: UTTAM KUMAR REDDY, BHATTI VIKRAMARKA, SRIDHAR BABU,CLP,PCC, GOVERNMENT HOSPITALS,ETELA RAJENDAR, TELANGANA GOVERNMENT, HEALTH MINISTER ETELA RAJENDAR,CM KCR,KTR, REVANTH REDDY, RUNAMAFI,RAITHU BHANDHU, CONGRESS MLAS,MLC,

Leave A Reply

Your email address will not be published.