News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సెన్సార్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నసినిమా యన్‌టిఆర్‌. ఎన్టీఆర్‌ పాత్రలో నటించిన ఆయన తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఎన్ బీకే ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలుగా రూపొందగా… యన్‌టిఆర్‌ కథానాయకుడు సంక్రాతికి విడుదలైంది. ఈ భాగంలో ఎన్టీఆర్‌ సినిమా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక రెండో భాగం యన్‌టిఆర్‌ మహానాయకుడులో రాజకీయ చరిత్రను చూపించబోతున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపధ్యంలో సినిమా యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రన్‌ టైమ్ 2గంటల  8నిమిషాలు ఉందట. ఇక ఈ రెండో భాగం భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.