News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

సోను.. నిజంగా.. బంగారమే..


వ‌ద‌ల బొమ్మాలి నిన్నోద‌ల అంటూ… తెలుగు ప్రేక్ష‌కుల మ‌నుసుల్లో దెయ్యంలా ముద్ర వేసుకున్న ఆయ‌న మ‌న‌సు మాత్రం వెన్న పూస‌. క‌రోనా సంక్షోభంలో చిక్కున్న కుటుంబాల‌కు బాస‌ట‌గా నిలుస్తూ.. తాను రీల్ లైఫ్ లో మాత్ర‌మే విల‌న్ ను.. రియ‌ల్ లైఫ్ లో హీరో అని చాటుకున్నారు బాలివుడ్ మీరో సోనూ సూద్. సోనూ సూద్ .. తెలు‌గు ప్రేక్ష‌కుల గుండెళ్లో భ‌యంక‌ర‌మైన విల‌న్. త‌న భ‌య‌పెట్టే న‌ట‌న‌తో.. తెలుగు ప్రేక్షకుల‌కు ప‌శుప‌తి, బిట్టు, మ‌ల్లి ఇలా విల‌న్ గా సుప‌రిచితుడు. మ‌రి ఇంత భ‌యంక‌రంగా క‌నిపించే సోనూ సూద్.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం చాలా సాఫ్ట్. అంతేకాదు.. క‌ష్టం ఉంద‌టే చాలు నేనున్నా అనే ర‌కం.

అవును.. చిత్తూరు జిల్లా కేవీప‌ల్లి మండ‌లం మ‌హ‌ల్రాజ‌ప‌ల్లిలో ద‌ళిత రైతు నాగేశ్వ‌ర‌రావు ఆర్థిక క‌ష్టాల కార‌ణంగా.. ఆయ‌న త‌న‌ భార్యతో క‌లిసి త‌మ ఇద్ద‌రు కూతుళ్ల‌ను కాడెద్దులుగా చేసుకుని పంట సాగుకోసం విత్త‌నం వేశారు.ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో చూసిన సోనూసూద్.. చిలించి పోయి 24 గంటల్లో ఆ రైతుకు ట్రాక్ట‌ర్ ను కొని ఇచ్చి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు.

అంతేకాదు.. హైద‌రాబాద్ , శ్రీన‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉండే శార‌ద సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్.లాక్ డౌన్ కార‌ణంగా ఉధ్యోగాన్ని కోల్పోయింది. దీంతో.. శార‌ద కూర‌గాయ‌లు అమ్ముతూ త‌న కుటుంబానికి బాస‌ట‌గా నిలిచింది.ఆమెకు సంబంధించిన‌ విడియోను చూసిన సోనూ సూద్.. శార‌ద‌కు .. ఆర్థికంగా బాస‌ట‌గా నిలిచారు. ఆమేకు త‌న కంప‌నీలో ఉద్యోగం క‌ల్పించి త‌న మ‌ను ఎంతో సున్నిత‌మైందో చాటుకున్నారు.

క‌రోనా ర‌క్క‌సిలో ఇరుక్కున్న ఎంద‌రికో సూద్ ఫౌండేష్ అండ‌గా నిలిచాడు. లాక్ డౌన్ సడ‌లింపుతో.. సొంతూళ్ల‌కు వెళ్లేందుకు డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్న ల‌క్ష‌కు పైగా వ‌ల‌స కూలిల‌ను ప్ర‌త్యేక‌ ట్రైన్ లు, బ‌స్సుల్లో వారి వారి సోంత ఊళ్ళ‌కు పంపించి త‌న దొడ్డ మ‌న‌సును చాటుకున్నారు సోనూ సూద్.
తెలుగు ప్రేక్ష‌కులు విల‌న్ గా చూస్తున్న సోనూ.. త‌న రీయ‌ల్ లైఫ్ లో .. సోనూ హీరో అంటు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోనూ సూద్ పై ప్ర‌శంశ‌ల జ‌ల్లు కురుస్తుంది. హ్యాట్సాఫ్ సోనూ..

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.