News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

హరీష్ రాజీనామా వెనక కారణం ఇదేనా..?

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కేసీఆర్ తన కుమారుడు కెటిఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన ప్పటి నుంచి అసంతృప్తిగా వున్న హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటార నేదీ అందరిలో ఆసక్తి నీ రేకెత్తిస్తోంది. అయితే తాజాగా హరీష్ రావు తీసుకున్న నిర్ణయం తో టీఆర్ఎస్ లో ముసలం మొదలందని అనిపిస్తుంది.

Harish Rao new

- Advertisement -

ఉద్యమ కాలం నుంచి ఆర్టీసీ కార్మికులకు సంభందించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు హరీష్ గౌరవ అధ్యక్ష హోదాలో వున్నారు. ఈ పదవికి గురువారం సాయంత్రం హరీష్ రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో tmu యూనియన్ నేతలు కేసీఆర్ కు వ్యతిరేక కామెంట్లు చేశారు. ఈ కామెంట్ ల వెనక హరీష్ రావు ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో కేసీఆర్ .. హరీష్ ను పిలిచి మందలించారు కూడా. అయితే ఇప్పుడు ఆ యూనియన్ కు హరీష్ రాజీనామా చేయటం వెనక కేసీఆర్ వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. హరీష్ ను అదుపులో పెట్టుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరిగి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.